Site icon NTV Telugu

ఏడేళ్లు రేవంత్ ఎక్క‌డున్నారు…!!

వైఎస్ ష‌ర్మిల ఈరోజు నుంచి ప్ర‌జా ప్ర‌స్థానం యాత్ర‌ను చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే.  చేవెళ్ల నియోజ‌క వ‌ర్గం నుంచి ఈ యాత్ర ప్రారంభం అయింది.  ఈ యాత్ర‌కు ముందు వైఎస్ ష‌ర్మిల ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు.  రాష్ట్రంలోని ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌ను ఆమె త‌ప్పుప‌ట్టారు.  అదే విధంగా కాంగ్రెస్ పార్టీపై ష‌ర్మిల విరుచుకుప‌డ్డారు.  తాము దీక్ష‌లు చేస్తేనే కేసీఆర్‌కు ఉద్యోగ భ‌ర్తీలు గుర్తుకు వ‌స్తాయ‌ని వైఎస్ ష‌ర్మిల మండిప‌డ్డారు.  కాంగ్రెస్ పార్టీ రేవంత్‌ను అరువుతెచ్చుకొని అధ్య‌క్షుడిని చేసింద‌ని, ఏడేళ్ల‌పాటు రేవంత్ రెడ్డి ఎక్క‌డ ఉన్నార‌ని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. రాజ‌న్న సంక్షేమ రాజ్యాన్ని తిరిగి తెలంగాణ రాష్ట్రంలో తీసుకొస్తామ‌ని ష‌ర్మిల తెలిపారు.  చేవెళ్ల నుంచి 4000 కిలోమీట‌ర్ల పాద‌యాత్ర సాగ‌నున్న‌ది.  చేవెళ్ల నుంచి ప్రారంభించిన యాత్ర‌ను చేవెళ్ల‌తోనే ముగియ‌నున్న‌ది.  

Read: బోర్డ‌ర్‌లో మ‌ళ్లీ ఉద్రిక్త‌త‌: ఎల్ఏసీకి డ్రాగ‌న్ రాకెట్లు…

Exit mobile version