Site icon NTV Telugu

వైరల్.. అభయ్ రామ్ ఫోటోను షేర్ చేసిన ఎన్టీఆర్

young tiger ntr

టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. నందమూరి అభిమానులు ఎన్టీఆర్‌ను అమితంగా ఇష్టపడుతుంటారు. అటు సోషల్ మీడియాలోనూ ఎన్టీఆర్‌కు మిలియన్‌ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌ అకౌంట్ల ద్వారా ఎన్టీఆర్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు. అందుకే ఆయన ఏ ఫోటో షేర్ చేసినా క్షణాల్లోనే అది వైరల్‌గా మారుతుంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంతో పాటు ప్యారిస్ టూర్‌లో ఉన్నాడు. శనివారం ఉదయమే ఆయన తన ఫ్యామిలీతో కలిసి ప్యారిస్ వెళ్లాడు.

Read Also: ఫ్యామిలీతో ఎన్టీఆర్ వెకేషన్.. ఈ సమయంలో అవసరమా..?

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా ఓ ఎమోషనల్ పిక్ షేర్ చేశాడు. తన పెద్దకుమారుడు అభయ్ రామ్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోను షేర్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. సదరు ఫోటోలో ఎన్టీఆర్… అభయ్ రామ్‌ను ప్రేమతో ముద్దాడుతుండగా… వెనుక ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ కనిపిస్తోంది. ఈ ఫోటోను చూసిన నందమూరి అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. యూరప్ పర్యటనలో తారక్ తన కుటుంబంతో వారం లేదా పది రోజులు గడపనున్నట్లు తెలుస్తోంది. గత రెండేళ్లుగా ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ఎన్టీఆర్ బిజీబిజీగా గడిపాడు. సంక్రాంతి తర్వాత కొరటాల శివ సినిమాతో మళ్లీ మేకప్ వేసుకోనున్నాడు. ఈ మధ్యలో దొరికిన విరామాన్ని తారక్ కుటుంబంతో గడుపుతున్నాడు. కాగా చంద్రబాబు కంటతడి పెట్టుకున్న ఘటనపై శనివారం ఓ వీడియో ద్వారా జూ.ఎన్టీఆర్ స్పందించిన విషయం తెలిసిందే.

Exit mobile version