ఫ్యామిలీతో ఎన్టీఆర్ వెకేషన్.. ఈ సమయంలో అవసరమా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం షూటింగ్లకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఇటీవల ఆయన చేతికి గాయం కావడంతో కొద్దిరోజులు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ఎన్టీఆర్ కి ఖాళీ దొరికింది. దీంతో ఫ్యామిలీతో వెకేషన్ ప్లాన్ చేశాడు ఎన్టీఆర్.. తన కుటుంబంతో స్విట్జర్లాండ్ కు బయలుదేరాడు. ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ విమానాశ్రయంలో భార్య పిల్లలతో కలిసి కనిపించాడు.ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ వెకేషన్ ఎన్ని రోజులు అనేది తెలియాల్సి ఉంది.

ఇకపోతే మరో పక్క ఎన్టీఆర్ వెకేషన్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. నిన్ననే నందమూరి ఫ్యామిలీకి అసెంబ్లీలో అవమానం జరిగింది. నందమూరి ఫ్యామిలీ అంతా ఒక పక్క కోపంతో రగిలిపోతున్నారు… ఈ టైంలో ఎన్టీఆర్ కుటుంబంతో ఎంజాయ్ చేయడం ఏంటీ ..? అని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉదయం ఒక వీడియో ద్వారా స్పందించినా కూడా అది ఏదో నామమాత్రంగా చెప్పినట్లు ఉందే తప్ప.. ఇంకా ఫైర్ లేదని అభిమానులు మండిపడుతున్నారు. ఇక మరోపక్క తారక్ అభిమానులు మాత్రం ఫ్యామిలీతో ఎన్టీఆర్ వెకేషన్ కి వెళ్ళేది తక్కువే.. టైమ్ ఉన్నప్పుడు కుటుంబంతో గడపడంలో తప్పేముంది అని సమర్థిస్తున్నారు.

Related Articles

Latest Articles