NTV Telugu Site icon

ట్రాఫిక్ చలానాలు భరించలేక బైక్‌ను తగలబెట్టిన యువకుడు

bike

bike

ట్రాఫిక్‌ చలానాలు ఇప్పుడు సామాన్యులను భారంగా మారుతున్నాయి… వరుసగా వస్తున్న ట్రాఫిక్ చలానాలు భరించలేక ఓ యువకుడు ఏకంగా తన బైక్‌పై పెట్రోల్‌ పోసి తగలబెట్టడం కలకలం సృష్టిస్తోంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన తలారి రత్నప్ప తనయుడు సంగప్పకు టీఎస్‌ 34 డీ 2183 నంబర్‌ గల బైక్‌ ఉంది.. ఆ ద్విచక్రవాహనంపై 5,500 రూపాయలు చలానాగా ఉంది. బైక్ పై కూలి పనుల నిమిత్తం చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లివస్తుంటాడు సంగప్ప.. అయితే, నిబంధనలను ఉల్లంఘించారంటూ ట్రాఫిక్‌ పోలీసులు చలానాలు వేయడంతో.. ఆ మొత్తం 5 వేలు దాటేసింది.

ఇక, ఇవాళ సాయంత్రం సుమారు ఐదు గంటల ప్రాంతంలో తాండూర్ మండల్ గౌతాపూర్ గేటు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా తన బైక్ పై రూ.5 వేలుకు పైగా చలానా ఉందని చెప్పారు పోలీసులు.. వెంటనే చెల్లించాలని సూచించారు. అయితే, పోలీసులు ఫోటోలు తీసి చలానాలు వేస్తున్న తీరు భరించలేక పెద్దేముల్ సొసైటీ వెనుక భాగంలో బాధితుడు సంగప్ప తన బైక్ ను పెట్రోలు పోసి తగలబెట్టాడు. మరి రూల్‌ అంటే రూలే.. అందరికీ ఒక్కటే రూల్‌ అని పోలీసులు చెబుతుండగా.. చలానాల భయానికి బైక్‌నే తగలబెట్టడం మాత్రం కలకలం సృష్టిస్తోంది.