దేశం ఏదైనా మహిళలపై జరుగుతున్న ఆరాచకాలు ఏ మాత్రం తగ్గడంలేదు. రోజురోజుకు మహిళలపై హింసా పెరిగిపోతూనే ఉన్నది. లైంగికంగా హింసిస్తూనే ఉన్నారు. బ్రిటన్ లోని మాంచెస్టర్ చెందిన ఓ నర్సు పుస్తకాలను బుక్ చేసింది. డ్యూటీకి వెళ్లిన సమయంలో ఆమెకు ఆన్‌లైన్ డెలివరీ బాయ్ నుంచి ఫోన్ వచ్చింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పార్సిల్‌ను పక్కన ఉన్న ఇంట్లో ఇచ్చి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన నర్స్ పక్కింటి నుంచి పార్సిల్ కవర్‌ను తీసుకున్నది. ఈ తరువాతే అమెకు వేధింపులు మొదలయ్యాయి. నర్స్ మొబైల్ ఫోన్‌కు మెసేజ్‌లు రావడం మొదలయ్యాయి.
Read: ఆ దేశంలో సంతోషం ఉన్నా…జనాలు లేరట…
అసభ్యకరమైన మెసేజ్‌లు, అశ్లీల వీడియోలు రావడంతో ఆ యువతి భయపడింది. చాలా రోజుల వరకు సహనం వహించంది. అయితే, రోజురోజుకు హింస పెరిగిపోతుండటంతో భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. నర్స్ ఎలియనోర్ పై పక్కింట్లో ఉండే జీహద్ ఖాన్ కన్నేశాడు. ఆమెను ప్రేమ పేరుతో అనేకమార్లు హింసించే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత పార్సిల్‌లోని నెంబర్ ఆధారంగా ఆమెకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ లైంగికంగా హింసించాడు. పోలీసులు జీహాద్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పార్సిల్ పై ఫోన్ నెంబర్ల వంటివి ప్రచురించవద్దని ఎలియనోర్ సోషల్ మీడియాలో పేర్కొన్నది.
