ఆ దేశంలో సంతోషం ఉన్నా…జనాలు లేర‌ట‌…

ప్ర‌పంచంలో సంతోష‌క‌ర‌మైన జీవితాల‌ను గ‌డిపే ప్ర‌జ‌లున్న దేశాల్లో ఫిన్లాండ్ మొద‌టిస్థానంలో నిలిచింది. ఇలా మొదటిస్థానంలో నిల‌వ‌డం ఇది నాలుగోసారి.   సంతోషం మెండుగా ఉన్న‌ప్ప‌టికీ ఆ దేశాన్ని ఓ స‌మ‌స్య ప‌ట్టిపీడిస్తోంది.  అదే జ‌నాభా.  ఫిన్లాండ్‌లో జ‌నాభ త‌క్కువ‌గా ఉంది.  ప‌శ్చిమ యూర‌ప్ దేశాల్లో జ‌న‌సాంద్ర‌త‌ త‌క్కువ‌గా ఉంటుంది.  అయితే, ఫిన్లాండ్‌లో ఈ జ‌న‌సాంద్ర‌త మ‌రీ త‌క్కువ‌గా ఉన్న‌ది.  ఫిన్లాండ్ మొత్తం జ‌నాభ 5.2 మిలియ‌న్ మంది.  ఇందులో ప‌నిచేయ‌గ‌లిగే వ‌య‌సున్న‌వారు కేవ‌లం 65 శాతం మంది మాత్ర‌మే.  39.2శాతం మంది వృద్దులు ఉన్నారు.  

Read: ఈ ప‌ద్ద‌తిని పాటిస్తే 35 శాతం డ‌బ్బును ఆదా చేయ‌వ‌చ్చు…

2030 నాటికి ఇది 47 శాతానికిపైగా పెరుగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.  దీంతో వేగంగా జ‌నాభాను పెంచుకోవ‌డానికి ఫిన్లాండ్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది.  వివిధ దేశాల నుంచి ఫిన్లాండ్ వ‌చ్చి ఉద్యోగాలు చేసే వారికి వీసాల‌ను స‌ర‌ళీకృతం చేసింది.  అంతేకాదు, స్టార్టప్‌లకు అనుమ‌తులు ఇచ్చింది.  భార్యాభ‌ర్త‌లు ఉద్యోగాలు చేసేందుకు అనుమ‌తులు ఇచ్చింది.  అయిన‌ప్ప‌టికీ కొంత‌కాలంపాటు ప‌నిచేసి ఫిన్లాండ్ నుంచి వెళ్లిపోతున్నార‌ట‌.  క‌రోనా కార‌ణంగా ఇలా జ‌రుగుతున్న‌ట్టు అధికారులు గుర్తించారు.  క‌రోనా త‌రువాత ఫిన్లాండ్ కు వ‌చ్చే ఉద్యోగుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.  

Related Articles

Latest Articles