NTV Telugu Site icon

చిత్తశుద్ధి ఉంటే వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలి : చంద్రబాబు

ఏపీలో మరోసారి రాజకీయం వేడెక్కింది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం పనుల్లో అవినీతి జరిగిందన్నారని.. కానీ కేంద్రం ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదని తేల్చిచెప్పిందన్నారు. రివర్స్‌ టెండరింగ్‌తో ప్రాజెక్టులను నాశనం చేశారని.. రివర్స్‌ టెండరింగ్‌లో ఏం సాధించారు..? అని ఆయన ప్రశ్నించారు. అవగాహన లేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని.. పార్లమెంట్‌లో ఏపీ ప్రత్యేక హోదా గురించి ఎందుకు ప్రస్తావించలేదన్నారు.

చిత్తశుద్ది ఉంటే వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారంటూ సవాల్‌ విసిరారు. రాజీనామా చేసి కలిసిపోరాడదామని అంటూ వ్యాఖ్యానించారు. రోజురోజుకు వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, పరిపాలన అనుభవం లేని వ్యక్తి వల్ల అంతా నష్టమే జరుగుతోందని ఆయన అన్నారు.