వైసీపీ ఎమ్మెల్యే రోజా తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఆమె సంబరానికి ఓ బలమైన కారణం ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా గత ఏడాది పుష్ప అనే చిన్నారిని వైసీపీ ఎమ్మెల్యే రోజా దత్తత తీసుకున్నారు. పుష్ప చదువు బాధ్యతలన్నీ స్వయంగా రోజా చూసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో పుష్ప 89% మార్కులు సాధించింది. తనను ఆదరిస్తున్న రోజాకు పుట్టినరోజు కానుకగా ఇచ్చింది. ఈ సంతోషాన్ని వైసీపీ ఎమ్మెల్యే రోజా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ మురిసిపోయారు. ఆ చిన్నారితో కలిసి రోజా కుటుంబ సభ్యులంతా ఫొటోలు దిగారు.
Read Also: శ్రీకాకుళం జిల్లాలో పేలుడు కలకలం…ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు
కాగా పి.పుష్పకుమారి అనే చిన్నారి బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. కానీ డాక్టర్ అవ్వాలనే తన ఆశయాన్ని మాత్రం వదులుకోలేదు. ఈ నేపథ్యంలో జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా మంచిపని చేయాలనే ఉద్దేశంతో పుష్ప గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే రోజా ఆ చిన్నారిని దత్తత తీసుకున్నారు. విద్య అంటే ఎంతో ఇష్టమైన ఆ చిన్నారిని చదివిస్తున్నారు. ఇప్పుడు ఆ చిన్నారి సాధించిన ఘనతను చూసి రోజా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
