Site icon NTV Telugu

ఉద్యోగ సంఘాలతో కొనసాగుతున్న బుగ్గన, సజ్జల చర్చలు

buggana rajendar sajjala ramakrishna

పీఆర్‌ఎస్‌తో పాటు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు నిరసనలకు దిగారు. అయితే ఇటీవల సీఎస్‌ సమీర్‌ శర్మ కమిటీ పీఆర్‌సీపై నివేదికను సీఎం జగన్‌కు అందజేసింది. అయితే సీఎస్‌ కమిటీ ఫిట్‌మెంట్‌ 14.29 ఇవ్వాలని నివేదికలో పేర్కొంది. దీనిపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగ సంఘాలతో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరుపుతున్నారు.

అయితే సీఎస్ కమిటీ సిఫార్సు మేరకు 14.29 శాతం ఫిట్‌మెంట్‌కు ఉద్యోగ సంఘాలు అంగీకరించాలని బుగ్గన, సజ్జల కోరారు. కనీసం 45 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు. సీఎస్ కమిటీ సిఫార్సు చేసిన శాతానికి దగ్గరగా ఉండేలా మరో సంఖ్యని చెప్పాలని మంత్రి బుగ్గన కోరారు. దీంతో ప్రస్తుతం ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జేఏసీ ఐక్య వేదిక ప్రతినిధులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు వివరించారు.

Exit mobile version