Site icon NTV Telugu

తీవ్ర తుఫాన్‌గా మారిన యాస్‌… మరికొద్ది గంటల్లో…

బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం బ‌ల‌ప‌డి తుఫాన్ యాస్‌గా మారింది.  ఇది ఇప్పుడు తూర్పు మ‌ద్య బంగాళాఖాతంలో తీవ్ర‌మైన తుఫాన్‌గా మారింది.  9 కి.మీ వేగంతో క‌దులుతూ మ‌రింత బ‌ల‌ప‌డుతున్న‌ది.  అతి కొద్ది గంట‌ల్లో ఈ యాస్ తుఫాన్ అతి తీవ్ర‌మైన తుఫాన్‌గా మారి బెంగాల్ ఒడిశా తీరాల‌వైపు దూసుకుపోయో అవ‌కాశం ఉన్న‌ట్టు వాతావ‌ర‌ణ శాఖ పేర్కొన్న‌ది.  పారాదీప్‌కు 360 కీలోమీట‌ర్లు, డిగాకు 450 కి.మీ దూరంలో ఈ యాస్ తుఫాన్ కేంద్రీకృత‌మైంది.  దీంతో ఒడిశా బెంగాల్‌కు ఆరెంజ్ మెసేజ్ వార్నింగ్ ఇచ్చింది వాతావ‌ర‌ణ శాఖ‌.  రేపు మ‌ధ్యాహ్నం బాలాసోర్ స‌మీపంలో ఈ యాస్ సైక్లోన్ తీరం దాట‌నుంద‌ని, తీరం దాటే స‌మ‌యంలో ఈ యాస్ తుఫాన్ గంట‌కు 115 కి.మీ గ‌రిష్ట‌వేగంతో గాలులు వీస్తాయ‌ని, ఉత్త‌రాంధ్ర‌లో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని, కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలియ‌జేసింది. 

Exit mobile version