Site icon NTV Telugu

Cricket: ఒకే రోజు రెండు ఘటనలు.. భారత్ ఓటమి, పాకిస్థాన్ విజయం

Team India 1

Team India 1

2024 అక్టోబర్ 26న (శనివారం) క్రికెట్ ప్రపంచంలో రెండు పెద్ద సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు.. 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి టెస్ట్ సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది పాకిస్తాన్. మరోవైపు.. 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రెండవ మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి కైవసం చేసుకుంది. కివీస్‌తో జరిగిన ఈ టెస్టు సిరీస్‌ను కోల్పోయిన భారత్‌కి ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరడం సవాలుగా మారింది.

Read Also: IND vs NZ: టెస్ట్ సిరీస్‌ను కోల్పోవడం నిరాశపరిచింది.. ఓటమికి కారణం చెప్పిన రోహిత్

భారత్ ఓటమి.. పాకిస్థాన్ విజయం తర్వాత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో జట్ల స్థానం గురించి తెలుసుకుందాం. కివీస్ జట్టుతో భారత్ వరుసగా రెండు టెస్టు మ్యాచ్‌ల్లో ఓడిపోయినా.. భారత్ ఇప్పటికీ నంబర్ వన్ స్థానంలోనే ఉంది. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో భారత్ 8 గెలిచింది.. 4 ఓడిపోయింది.. ఒక మ్యాచ్ డ్రా అయింది. ప్రస్తుతం భారత్ గెలుపు శాతం 62.82గా ఉంది. ప్రస్తుతం కివీస్ జట్టు 10 మ్యాచ్‌ల్లో 5 గెలిచి 5 ఓడిపోయి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ జట్టు విజేత శాతం 50.00గా ఉంది.

Read Also: Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

ఇంగ్లండ్‌పై పాకిస్థాన్ వరుసగా రెండు టెస్టు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ ఆరో స్థానంలో ఉంది. పాకిస్థాన్ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లలో 4 గెలిచింది. 6 ఓడిపోయింది.. ఈ జట్టు ఓటమి శాతం 33.33గా ఉంది. ఇంగ్లండ్‌ జట్టు 19 మ్యాచ్‌లలో 9 గెలిచింది. 9 ఓడిపోయింది, ఒక మ్యాచ్ డ్రా అయింది. ఈ జట్టు విజేత శాతం 40.79గా ఉంది. పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉండగా, శ్రీలంక మూడో స్థానంలో ఉంది.

Exit mobile version