ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. కరోనా నుంచి బయటపడేందుకు టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇక, విమానాల్లో ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకొని నెగిటివ్ సర్టిఫికెట్ ఉండాల్సిందే. కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ లేకుండా ప్రయాణం చేసేందుకు అవకాశంలేదు. ఇక ఇదిలా ఉంటే, అమెరికాలోని చికాగో నుంచి ఐస్‌లాండ్‌కు 159 మంది ప్రయాణికులతో విమానం బయలుదేరింది. విమాన ప్రయాణానికి ముందు ప్రయాణికులకు టెస్టులు చేశారు.
Read: వైరల్: టైగర్ దెబ్బకు జైలో తుక్కు…
నెగెటివ్ వచ్చిన ప్రయాణికులు విమానంలో బయలుదేశారు. గంట ప్రయాణం తరువాత మారీసా ఫోటియో అనే మహిళకు గొంతునొప్పిగా ఉండటంతో ప్రయాణంలోనే ఆమెకు విమాన సిబ్బంది కరోనా టెస్టును చేశారు. ఈ టెస్టుల్లో ఆమెకు పాజిటివ్ గా తెలింది. దీంతో మారీసా బాత్‌రూమ్‌కు వెళ్లి అక్కడే ఐదు గంటలపాటు స్వీయనిర్భంధంలో ఉండిపోయింది. ఐస్‌లాండ్‌లో ల్యాండ్ అయ్యాక ఆమెను ఆసుపత్రికి తరలించారు. విమానం ఎక్కుముందు ఆమె ఐదుసార్లు కోవిడ్ టెస్టులు చేయించుకున్నట్టు తెలియజేసింది.
