యాభైఏళ్ల క్రితం ఓ మహిళ తన పెళ్లి ఉంగరాన్ని పోగొట్టుకుంది. తన ఇంటి ఆవరణలో బంగాళదుంపలను సేకరిస్తుండగా ఆ మహిళ తన విలువైన ఆ ఉంగరాన్ని పోగొట్టుకుంది. పోగొట్టుకున్న ఆ ఉంగరం కోసం కొన్ని రోజులు వెతికినా ఫలితం లేకపోయింది. ఆ తరువాత కాలంలో దాని గురించి ఆ మహిళ మర్చిపోయింది. అయితే, ఇటీవలే ఆ మహిళ పెళ్లి ఉంగరాన్ని పోగొట్టుకుందనే వార్త స్థానికంగా నివశించే మెటల్ డిటెక్టర్ డొనాల్డ్ మాక్‌ఫీకి తెలిసింది. ఎలాగైనా ఆ ఉంగరాన్ని కనిపట్టాలని భావించారు. ఆ కేసును సీరియస్‌గా తీసుకొని మూడు రోజులపాటు 90 వేల చదరపు మీటర్ల మేర గాలించాడు.
Read: డిసెంబర్ 5, ఆదివారం.. దిన ఫలాలు : వారికి అనుకోని లాభాలు
మెటల్ డిటెక్టర్ ఉంగరాల ఆకారంలో ఉన్న వాటిని గుర్తించినపుడు ఒకే విధమైన ధ్వని చేస్తుంటాయి. మూడు రోజులపాటు 90 రకాల గుంటలు తవ్వాడు గుర్రపు నాడాలు, చిన్న చిన్న డబ్బాలు, ఇతర వస్తువులు బయటపడ్డాయి. మూడో రోజు అతనికి ఆ ఉంగరం దొరికింది. అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 87 ఏళ్ల పెగ్గి మాక్‌స్వీన్ మహిళ 50 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న ఉంగరం దొరకడంతో ఆ మహిళ కూడా ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేసింది. ఈ సంఘటన బ్రిటన్‌కు సమీపంలో ఉన్న వెస్ట్రన్ ఐల్స్ దీవిలో జరిగింది.