Site icon NTV Telugu

మీ దళితబంధు ఎటు పోయింది : కిషన్‌రెడ్డి

అంబేద్కర్‌ వర్థంతిని పురస్కరించుకొని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితబంధుపై కీలక వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్‌ ఉప ఎన్నిక కోసమే దళితులను కేసీఆర్‌ మభ్యపెట్టారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఎన్నికల తరువాత దళిత బంధు ఎందుకు అమలు చేయటంలేదో కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు.

దళితులకు మేలు చేసే ఉద్దేశం ఉంటే తక్షణమే దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీపై నిందలు వేసి వరద బాధితులకు నష్టపరిహారం ఎగ్గొట్టారని.. ఇప్పుడు మరోసారి మా మీద నిందలు వేసి దళితబంధును పక్కన పెట్టారన్నారు. కేసీఆర్‌వి అన్ని మాయమాటలేనని కిషన్‌రెడ్డి విమర్శించారు.

Exit mobile version