ఆఫ్ఘనిస్తాన్‌లో 20 ఏళ్లపాటు సేవలు అందించిన అమెరికా దళాలు అగస్ట్ 30 వ తేదీ వరకు పూర్తిగాఖాళీ చేసి వెళ్లిపోయాయి. అఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో అక్కడ ఉండటం ఇష్టంలేని వ్యక్తులు ఆ దేశాన్ని వదిలిపెట్టి వలస వెళ్లిపోయారు. అమెరికా దళాలు వెళ్లే సమయంలోచాలా మందిని శరణార్థులను విదేశాలకు తరలించింది అమెరికన్ సైన్యం. కాబూల్‌లోని ఎయిర్‌పోర్ట్ వద్ద లోపలికి వెళ్లేందుకు పడిగాపులు కాస్తున్న ఓ కుటుంబంలోని చిన్నారిని అమెరికా సైనికుడు అందుకొని లోపలికి తరలించాడు. ఓ గంట తరువాత ఆ చిన్నారి కుటుంబం మొత్తం ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంటర్ అయింది. కానీ, ఆ సైనికుడు తీసుకున్న చిన్నారి కనిపించలేదు. ఏమయ్యాడో తెలియదు.
Read: వ్యాక్సిన్ తెచ్చిన అదృష్టం: రాత్రికి రాత్రే…
కాగా, ఆ కుటుంబం ఖతర్ నుంచి జర్మనీ అక్కడి నుంచి అమెరికాలో శరణార్ధులుగా కాలం గడుపుతున్నారు. ఆ కుటుంబం గత 80 రోజులుగా తమ బిడ్డ కోసం అధికారులను కలుస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఆ బిడ్డ ఆచూకి కనిపెట్టలేకపోయారు. చిన్నారి ఏమయ్యాడో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాగా, అమెరికా అధికారులు ఈ కేసును ప్రత్యేకంగా తీసుకున్నారు. త్వరలోనే ఆ చిన్నారి ఆచూకి కనిపెడతామని ఆ కుటంబానికి ధైర్యం చెబుతున్నారు.