వ్యాక్సిన్ తెచ్చిన అదృష్టం:  రాత్రికి రాత్రే…

క‌రోనా మహ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డాలి అంటే త‌ప్ప‌నిస‌రిగా వ్యాక్సిన్ తీసుకోవాలి.  వ్యాక్సిన్ ఒక్క‌టే ప్ర‌స్తుతానికి కొంత ఉప‌మ‌నం కలిగిస్తోంది.  వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత ప్ర‌పంచంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య త‌గ్గిపోయింది.   క‌రోనా వైర‌స్ సోకినా ఆసుప‌త్రికి వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండానే బ‌య‌ట‌ప‌డుతున్నారు.  అయితే, చాలా ప్రాంతాల్లో వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్ర‌జ‌లు పెద్ద‌గా ఆసక్తి చూప‌డం లేదు.  వీరి కోసం ఆక‌ర్ష‌ణీయ‌మైన బ‌హుమ‌తుల‌ను అందిస్తూ వ్యాక్సిన్ అందిస్తున్నారు.  అటు ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం వినూత్నంగా ఆలోచించి వ్యాక్సిన్ తీసుకున‌న వారికి మిలియ‌న్ డాల‌ర్ల ప్రైజ్‌మ‌నీ గెలుచుకునే అవ‌కాశం క‌ల్పించింది.  

Read: వైర‌ల్‌: వెరైటీ టాలెంట్‌… స‌ల‌స‌ల కాగే నూనెలో…

ఇందుకోసం ప్ర‌భుత్వం లాట‌రీ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది.  దాదాపుగా3 మిలియ‌న్ మంది ప్ర‌జ‌లు వ్యాక్సిన్ తీసుకొని త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు.  అయితే, అదృష్టం 25 ఏళ్ల జోవాన్‌ను వ‌రించింది. జోవాన్‌కు ల‌క్కీ్డ్రాలో ఏకంగా మిలియన్ డాల‌ర్ల ప్రైజ్ మ‌నీ గెలుచుకున్న‌ది.  మొద‌ట ఆమెకు నిర్వాహ‌కుల నుంచి ఫోన్ రాగా ఇగ్నోర్ చేసింది.  రెండోసారి నిర్వాహ‌కులు ఫోన్ చేసి చెప్ప‌డంతో ఆమె సంతోషానికి అవ‌ధులు లేకుండా పోయాయి.  రాత్రికి రాత్రే మిలీనియ‌ర్ కావ‌డంతో సంతోషం వ్య‌క్తం చేస్తున్న‌ది. 

Related Articles

Latest Articles