Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

  1. లాన్స్‌ నాయక్‌ సాయితేజ అంత్యక్రియలు నేడు చిత్తూరు జిల్లాలోని జరుగనున్నాయి. ఉదయం 10 గంటలకు ఎగువరేగడికి సాయితేజ భౌతికకాయం చేరుకోనుంది. మధ్యాహ్నం సైనిక లాంఛనాలతో సాయితేజ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
  2. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ నేడు విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష చేపట్టారు. మంగళగిరిలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పవన్‌ దీక్ష జరుగనుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై సీఎం జగన్‌ స్పందించాలని పవన్ డిమాండ్‌ చేయనున్నారు.
  3. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,200లుగా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,100లుగా ఉంది. అయితే కిలో వెండి ధర రూ. 65,100లుగా ఉంది.
  4. స్పెయిన్‌లో నేటి నుంచి ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి మొదటి మ్యాచ్‌ జరుగనుంది. మహిళల సింగిల్స్‌లో ఫేవరేట్‌గా పీవీ సింధు బరిలో దిగనుంది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌, సాయిప్రణీత్‌ బరిలో నిలువనున్నారు.
  5. యావత్త ప్రపంచాన్ని మరోసారి భయాందోళనకు గురిచేస్తున్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు భారత్‌లో 33కు చేరుకున్నాయి. అయితే మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా అక్కడి ప్రభుత్వం నేడు కూడా రాష్ట్రంలో 144 సెక్షన్‌లో అమలులో ఉంచింది. ప్రజలు సహాకరించాలని కోరింది.
Exit mobile version