* నేడు జూబ్లీహిల్స్ లో కేటీఆర్, హరీష్ రావు పర్యటన.. ఉదయం 9.45 గంటలకు షేక్ పేట్ లో రిలయన్స్ గేటెడ్ కమ్యూనిటీలో సమావేశానికి హాజరు.. ఉదయం 11 గంటలకి జహీరాబాద్ మెడికల్ విద్యార్థులతో భేటీ.. సనత్ నగర్ నియోజకవర్గం హమాలీ బస్తీలో.. బొడ్రాయి పండగలో పాల్గొననున్న కేటీఆర్, హరీష్ రావు..
* నేడు హైదరాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన.. ఉదయం 8. 30 గంటలకి నల్లకుంటలోని శంకర్ మట్ టెంపుల్ లో స్వామిని దర్శించుకోనున్న కిషన్ రెడ్డి.. 11 గంటలకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంకటగిరి పరిధిలోని ఆఫీసర్స్ కాలనీలో ప్రధాని “మాన్ కీ బాత్” కార్యక్రమాన్ని బీజేపీ కార్యకర్తలతో కలిసి వీక్షించనున్న కిషన్ రెడ్డి..
* నేడు నిజామాబాద్ జిల్లాలో రెండో రోజు కొనసాగనున్న తెలంగాణ జాగృతి జనంబాట.. మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో పోడు భూముల బాధిత రైతులను పరామర్శించనున్న కవిత..
* నేడు అచ్చంపేటకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. వనవాసి కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో చెంచు జంటల సామూహిక వివాహాలకు హాజరుకానున్న గవర్నర్.. 108 చెంచు జంటలకు ఒకే వేదికపై వివాహాలు..
* నేడు తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య సమావేశం.. సాయంత్రం 5గటలకు జనరల్ బాడీ మీటింగ్.. నవంబర్ 3 నుంచి కాలేజీల బంద్ కు సమాఖ్య నిర్ణయం.. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన సమాఖ్య.. ఫీజురీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్..
* నేడు ఆస్ట్రేలియాలో ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న మంత్రి నారా లోకేష్.. 7 రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటించిన లోకేష్.. పెట్టుబడులు, విద్య సంస్కరణలపై పలు సమావేశాల్లో పాల్గొన్న నారా లోకేష్..
* నేటి నుంచి నాలుగు రోజుల పాటు తుఫాన్ పెను ప్రభావం.. ఏపీ వైపు దూసుకొస్తున్న మొంథా తుఫాన్.. ఈ నెల 28న కాకినాడ సమీపంలో తీవ్రమైన తుఫానుగా తీరం దాటే అవకాశం..
* నేటి నుంచి విధుల్లోకి PHC డాక్టర్లు.. వైద్యారోగ్యశాఖ మంత్రి ఇచ్చిన హామీతో PHC డాక్టర్ల నిరాహార దీక్ష ముగింపు.. నవంబర్ లో చర్చల తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుందని ప్రకటన..
* నేటి నుంచి రాజమండ్రి- పుదుచ్చేరి విమాన సర్వీసులు.. ఉదయం 10.05కి బయల్దేరనున్న ఇండిగో సర్వీస్..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనం కోసం 21 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం..
* నేడు ప్రధాని మోడీ మన్ కీ బాత్ ప్రసారం.. ఉదయం 11 గంటలకి 127వ ఎపిసోడ్..
* నేటి నుంచి ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు.. కౌలాలంపూర్ లో ప్రారంభంగానున్న సదస్సు.. తూర్పు తైమూర్ దేశానికి 11వ సభ్య దేశంగా స్వాగతం.. అమెరికా సుంకాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం.. సదస్సుకు వర్చువల్ గా హాజరు కానున్న ప్రధాని మోడీ..
* నేడు ప్రొ కబడ్డీలో ఎలిమినేటర్ మ్యాచ్.. రాత్రి 8గంటలకి జైపూర్ వర్సెస్ పట్నా మ్యాచ్.. మినీక్వాలిఫయర్ లో బెంగళూరు వర్సెస్ తెలుగు టైటాన్స్.. రాత్రి 9గంటలకి ప్రారంభంగానున్న మ్యాచ్..
* నేడు ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ లో రెండు మ్యాచ్ లు.. విశాఖ వేదికగా ఉదయం 11 గంటలకి ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్.. ముంబై వేదికగా మధ్యాహ్నం 3గంటలకి భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్..
