* నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. కొల్లాపూరు (మం) జటప్రోలులో మనదగోపాల స్వామి ఆలయాన్ని సందర్శించనున్న సీఎం.. జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్.. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం..
* నేడు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం రేవంత్ రెడ్డి.. తన దగ్గర ఉన్న శాఖలపై సమీక్షించనున్న సీఎం రేవంత్..
* నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేటీఆర్ పర్యటన.. మదన్ లాల్, రేగా కాంతారావు కుటుంబాలకు పరామర్శ..
* నేడు మెదక్ జిల్లాలో బీజేపీ చీఫ్ రామచందర్ రావు పర్యటన.. మెదక్ ఏడుపాయల వనదుర్గ దేవాలయంలో అమ్మవారికి పూజలు.. వివిధ సంఘాలు, న్యాయవాదులు, ఉద్యోగులతో సమావేశం..
* నేడు నాంపల్లి కోర్టులో మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుపై ఏసీబీ కోర్టులోని కస్టడీ పిటిషన్ పై విచారణ.. వారం పాటు కస్టడీ కోరుతూ ఏసీబీ పిటిషన్.. కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన సమయంలో భారీగా ఆస్తులు సంపాదించిన మురళీధర్ రావు..
* తెలంగాణలో నేటి నుంచి బీ కేటగిరీ ఇంజినీరింగ్ సీట్ల భర్తీ.. తొలి విడత జనరల్ కౌన్సిలింగ్.. రేపటి నుంచి ఆగస్టు 10 వరకు బీ కేటగిరి సీట్ల భర్తీ..
* నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. టీడీపీ ఎంపీలతో భేటీ కానున్న చంద్రబాబు.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఈ భేటీ..
* నేడు సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ.. లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన మిథున్ రెడ్డి.. విచారించననున్న జస్టిస్ జేబీ పార్థివాల, జస్టిస్ మహదేవన్ ల ధర్మాసనం..
* నేడు ఎస్ఆర్ఎం వర్సీటీలో గ్రీన్ హైడ్రోజన్ కాన్ఫరెన్స్ కు హాజరుకానున్న సీఎం చంద్రబాబు..
* నేడు తూర్పు నావికాదళంలో చేరనున్న ఐఎన్ఎస్ నిస్తార్ యుద్ధనౌక.. సముద్రంలో గస్తీ, పరిశోధన, రక్షణ సేవలందించనున్న ఐఎన్ఎస్ నిస్తార్.. 80 శాతం దేశియ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ నిస్తార్ యుద్ధ నౌక..
* నేడు తెలంగాణకు వర్ష సూచన.. 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాలకు వర్ష సూచన..
* నేటి నుంచి ఈ నెల 24 వరకు ఏపీలో భారీ వర్షాలు.. ఇవాళ ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వర్షాలు..
* నేడు బీహార్, బెంగాల్ లో ప్రధాని మోడీ పర్యటన.. బీహార్ లో 7,200 కోట్ల విలువైన పనులకు శ్రీకారం.. నాలుగు కొత్త అమృత్ భారత రైళ్ల ప్రారంభం.. బెంగాల్ దుర్గాపూర్ లో అభివృద్ధి పనులకు శ్రీకారం.. చమురు, సహజవాయువు, ఇంధనం, రహదారులు, రైల్వేలు సహా పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..
