Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* నేడు మంగళగిరిలో సీఎం చంద్రబాబు, లోకేష్ పర్యటన.. ఉదయం 11 గంటలకు చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలతో చంద్రబాబు సమావేశం.. చేనేత కార్మికులతో మాట్లాడనున్న సీఎం చంద్రబాబు..

* నేడు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యటన.. ఉదయం 10 గంటలకు పెరవలి మార్కెటింగ్ చెక్ పోస్ట్ వద్ద డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రారంభించనున్న మంత్రి దుర్గేష్.

* నేడు ఒంగోలులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పర్యటన.. ఉదయం 6 గంటలకు విందు భోజనం హోటల్ వద్ద చాయ్ పే చర్చ.. 10 గంటలకు లాయరుపేట సమీపంలోని ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు.. పాత మార్కెట్ సెంటర్ వద్ద నుంచి జరిగే ర్యాలీలో పాల్గొంటారు..

* నేడు లిక్కర్ స్కాం కేసులో నిందితుడు చాణక్య బెయిల్ పిటిషన్ పై తీర్పు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు.. కేసులో ఏ8గా ఉన్న చాణక్య..

* నేడు రాజమండ్రిలో రెండో రోజు సిపిఐ 26వ మహాసభలు.. ముఖ్యఅతిథిగా హాజరుకానున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ..

* నేడు అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు..

* నేడు పీపుల్స్ ప్లాజాలో జాతీయ చేనేత దినోత్సవం.. హాజరుకానున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..

* నేడు మెదక్ కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో రైతుల మహాధర్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. ధర్నాలో పాల్గొననున్న మాజీ మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ నేతలు..

* నేడు యాదాద్రి జిల్లాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు.. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొనున్న రామచందర్ రావు.. అనంతరం స్థానిక బీసీ కాలనీలో చేనేత కార్మికులతో సమావేశం, అనంతరం బైక్ ర్యాలీ.. భువనగిరిలో బీజేపీ కార్యకర్తలతో ప్రత్యేక భేటీ..

* నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..

* నేటితో తిరుమలలో ముగియనున్న శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు.. ఇవాళ శ్రీవారి ఆలయంలో తిరుప్పావడ సేవ, ఆర్జిత సేవలు..

* నేడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు.. ఇవాళ్టి నుంచి యధావిధిగా శ్రీ స్వామివారి నిత్య సేవలు..

Exit mobile version