Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whatstoday

Whatstoday

నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. ప్రధాని మోడీ అధ్యక్షతన కీలక అంశాలపై చర్చ..

నేడు మరోసారి సీసీఎస్ కేబినెట్ భేటీ.. ఉదయం 11 గంటలకు ప్రధాని నివాసంలో ప్రారంభం కానున్న సీసీఎస్ సమావేశం.. 20 రోజుల వ్యవధిలో నాలుగోసారి సమావేశం.. కాల్పుల విరమణ తర్వాత తొలిసారి సమావేశం.. తాజా పరిణామాలపై చర్చించనున్న భద్రతా వ్యవహారాల కమిటీ..

నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం.. ఉదయం 10 గంటలకు ప్రమాణం చేయించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

నేటి నుంచి శ్రీనగర్ ఎయిర్ పోర్టులో విమాన సేవలు పున: ప్రారంభం.. యథావిధిగా కొనసాగనున్న విమాన సర్వీసులు..

నేడు సాయంత్రం ఏఈలు, జేటీఓలకు నియామకపత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇరిగేషన్ శాఖపై సమీక్షించనున్న సీఎం రేవంత్..

నేడు తెలంగాణ భవన్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్.. అమెరికాలో బీఆర్ఎస్ రజతోత్సవం వేడుకలకు సంబంధించి.. పోస్టర్ విడుదల చేయనున్న తలసాని శ్రీనివాస్ యాదవ్..

నేడు హైదరాబాద్ వేదికగా 8 జిల్లాల బీజేపీ అధ్యక్షుల సమావేశం.. భేటీలో తిరంగాయాత్రపై చర్చ..

నేడు వరంగల్ జిల్లాలో ప్రపంచ సుందరీమణుల పర్యటన.. వెయ్యి స్తంభాల గుడి, రామప్ప ఆలయంతో పాటు ఓరుగల్లు కోటను సందర్శించనున్న 109 దేశాల సుందరీమణులు..

నేడు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం.. పహల్గామ్ అమరులకు నివాళులర్పించనున్న టీడీపీ పొలిట్ బ్యూరో.. మహానాడు నిర్వహణ, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ..

నేడు కోర్టు ముందుకు వల్లభనేని వంశీ రిపోర్ట్స్.. వంశీ వైద్య పరీక్షల రిపోర్టులను.. కోర్టులో సమర్పించనున్న అధికారులు.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం..

నేడు విశాఖలో బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు పర్యటన.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న సోమువీర్రాజు.. సోము వీర్రాజు ఆధ్వర్యంలో బీజేపీలో చేరనున్న కార్యకర్తలు..

నేడు చీరాల మున్సిపల్ ఛైర్మన్ పై అవిశ్వాసం.. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన మున్సిపల్ ఛైర్మన్ జంజనం శ్రీనివాసరావు.. క్యాంప్ లో ఉన్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు..

నేడు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ లో ఈదురుగాలులు, వడగళ్ల వర్షం కురిసే అవకాశం..

నేడు ఏపీలో అల్లూరి, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, కడప, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు..

 

Exit mobile version