Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* నేడు మధ్యాహ్నం 12.30 గంటలకి విజయవాడ పోరంకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. పోరంకిలో ఫంక్షన్ హాల్లో కార్యక్రమానికి హాజరు కానున్న సీఎం చంద్రబాబు..

* నేడు తెనాలిలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటన.. టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న పెమ్మసాని..

* నేడు ఏపీ డీజీపీ కార్యాలయానికి వైసీపీ నేతల బృందం.. పులివెందుల ఉప ఎన్నికల ఘటనలపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్న వైసీపీ బృందం..

* నేటి నుంచి ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో తిరంగ యాత్రలు.. మండల, జిల్లా స్థాయిలో తిరంగా యాత్రలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయం..

* నేటి సాయంత్రం 5గంటలకు ముగియనున్న పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం.. పులివెందులలో టీడీపీ, వైసీపీ పోటా పోటీ ప్రచారాలతో పోలీసుల అప్రమత్తం..

* నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రీ కేంద్రంగా ఉన్న తూర్పుగోదా వరి జిల్లాలో విలీనం చేయాలని కోరుతూ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలతో సమావేశాలు.. నియోజకవర్గ అఖిలపక్ష నేతలు అన్ని మండలాల్లో సమావేశాలు ఏర్పాటు..

* నేడు మధిరలో నలుగురు మంత్రుల పర్యటన.. రూ. 600 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు శంఖుస్థాపన చేయనున్న మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు.. వైరా నది నుంచి నీటిని అందించేందుకు ఎత్తిపోతల పథకం..

* నేడు కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ భేటీ.. కమిటీ ఛైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం.. తెలంగాణ కాంగ్రెస్‌లో వరుసగా జరుగుతున్న అంతర్గత కలహాలపై చర్చ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఇంకా పరిష్కారం కాని కొండా మురళీ సమస్యపై చర్చ.. ఈ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ..

* నేడు సిద్దిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న హరీష్ రావు..

* నేడు ఉదయం 10 గంటలకి బీజేపీలో చేరనున్న గువ్వల బాలరాజు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందరరావు ఆధ్వర్యంలో పార్టీలో చేరనున్న గువ్వల..

* నేడు కర్ణాటకలో ప్రధాని మోడీ పర్యటన.. బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. బెంగళూరు మెట్రో ఫేజ్-3కు శంకుస్థాపన చేయనున్న నరేంద్ర మోడీ.. బెంగళూరు నుంచి 3 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని..

Exit mobile version