NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whatstoday

Whatstoday

నేడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లోనే చంద్రబాబు.. గత ఐదు రోజులుగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న సీఎం.. బాధితులకు పరిహారం ఇచ్చేందుకు నష్టంపై అంచనా.. ఈఎంఐల రీ షెడ్యూల్ కోసం నిన్న బ్యాంకర్లతో సమావేశం..
నేడు ఏపీకి కేంద్ర బృందం.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం.. కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పర్యటన.. వరద నష్టాన్ని అంచనా వేయనున్న కేంద్ర బృందం.. జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరిన సీఎం చంద్రబాబు..
నేడు తెలంగాణలో వరద బాధితులకు బీఆర్ఎస్ విరాళం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఒక నెల జీతం విరాళం.. ఖమ్మంకు లారీల్లో ఆహారం, దుస్తులు పంపనున్న బీఆర్ఎస్..
తెలంగాణలో నేటి నుంచి వరద బాధితులకు పరిహారం..
నేడు శ్రీకాకుళం జిల్లాలో కేంద్రమంత్రి రామ్మోహన్ పర్యటన.. గురుపూజోత్సవంలో పాల్గొననున్న రామ్మోహన్ నాయుడు..
నేటి నుంచి విజయవాడలో ఇంటింటికీ రేషన్ పంపిణీ.. ప్రతి ఇంటికీ 25 కీలోల బియ్యం, లీటర్ వంటనూనె.. కిలో కందిపప్పు, కిలో చక్కెర, కూరగాయలు పంపిణీ.. ఈరోజు సాయంత్రానికల్లా పూర్తిగా విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు..
నేడు ఏపీ, తెలంగాణలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటన.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న శివరాజ్ సింగ్ చౌహాన్..
నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పాడే అవకాశం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. పల్నాడు, ఎన్టీఆర్ఎర్, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఉభయగోదావరి.. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. 40కి.మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం..
నేడు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం.. రెండు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. మరో పది జిల్లాలకు ఎల్లో అలర్ట్..