NTV Telugu Site icon

SC Classification: ఎస్సీ వర్గీకణ అంటే ఏంటి?..మూడు దశాబ్ధాలుగా మంద కృష్ణ పోరాటం ఎందుకు..?

Sc Classification

Sc Classification

ఎస్సీల మూడు దశాబ్ధాల పోరాటానికి తెరపడింది. చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో సంబరాలు అంబరాన్నంటాయి. మందకృష్ణ మాదిగ మూడు దశాబ్ధాల ఉద్యమానికి ఫలితం లభించింది. 1972 నుంచి మొదలుకుని మారిన ప్రతీ ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని మందకృష్ణ మాదిగ.. అర్థమయ్యేలా వివరించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీనికోసం తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు తెలిపారు. చివరకు మందకృష్ణ పోరాటానికి ప్రధాని కరిగిపోయారు. మాదిగలకు సపోర్ట్ చేస్తున్నట్లు మోడీ ప్రకటించారు. గతేడాది హైదరాబాద్ లో నిర్వహించిన ‘మాదిగ విశ్వరూప మహాసభ’ సభకు ప్రధాని హాజరై వారికి మద్దతు తెలియజేశారు. చివరకు కోర్టు తీర్పు వర్గీకరణను సమర్థించింది. మందకృష్ణ మాదిగ విజయం సాధించడంతో సంబరాలు జరుపుకుంటున్నారు. ఇంతకు ఎస్సీ వర్గీకరణ అంటే ఏమిటి? దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

READ MORE: Speaker Vs Harish Rao: మీరు చైర్ కి నేర్పించాల్సిన అవసరం లేదు.. హరీష్‌ రావు పై స్పీకర్‌ ఫైర్‌..

2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా 1,38,78,078. వీరిలో మాదిగలు 67,02,609 మంది కాగా, మాలలు 55,70,244 మంది. అంటే మాదిగల జనాభా మాలలకన్నా దాదాపు 11.3 లక్షలు ఎక్కువన్నమాట. మొత్తం ఎస్సీ జనాభాలో ఈ రెండు కులాల జనాభానే 80 శాతం వరకూ ఉండొచ్చనేది ఓ అంచనా. మిగతా 57 కులాల్లో పెద్ద సంఖ్య రెల్లి కులానిది. వీరు మూడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఉంటారు. అయితే, ఈ కులాలన్నీ కూడా ఊరవతల వెలివాడల్లో నివసించినవి. అప్పటి సమాజంలో దారుణమైన అణచివేతను, అంటరానితనాన్ని, వివక్షను ఎదుర్కొన్నాయి. ఎస్సీల్లో కూడా ఎక్కువ, తక్కువలున్నాయి. ఉదాహరణకు, మాదిగల్ని మాలలు తక్కువగా చూస్తారు. కాగా.. ఎస్సీ జనాభాలో మాలల కన్న మాదిగలు అధికంగా ఉండడంతో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు.. విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో వీరికి అన్యాయం జరుగుతుందని అప్పట్లో కొందరు మేధావులు తెలుసుకున్నారు. మాదిగల జనాభా అధికంగా ఉన్నప్పటికీ విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో మాత్రం వెనకబడి ఉన్నాని అభిప్రాయపడ్డారు. 70 శాతం ఉన్న మాదిగ, మాదిగ ఉపకులాలు 10 శాతం రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతుంటే, 30 శాతం ఉన్న మాలలకు 90 శాతం అందుతున్నాయని వారి అభిప్రాయం.

READ MORE: IPL 2025 Mega Auction: నెస్ వాడియాతో షారుఖ్‌ ఖాన్ వాగ్వాదం.. కావ్య మారన్ మద్దతు!

1994లో ఉద్యమం..
అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అప్పట్లో చాలా ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. అందులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) ప్రధానమైనది. మంద కృష్ణ మాదిగ దీనిని స్థాపించారు. ఈ ఉద్యమాన్ని ఆయన 1994లో మొదలు పెట్టి మాదిగల హక్కుల కోసం పోరాటానికి నాంది పలికారు. పాదయాత్ర చేస్తూ.. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో మాదిగలకు దక్కాల్సిన వాటా దక్కాల్సిందేనంటూ మాదిగలను చైతన్య పరిచారు. ఈ నేపథ్యంలోనే ఎస్సీ కులాలను A,B ,C,D గ్రూపులుగా విభజించి ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం 15 శాతం ఉన్న రిజర్వేషన్ కోటాను పెంచాలనే డిమాండ్ చేశారు. బీసీల్లో ఉన్న ఏబీసీడీ వర్గీకరణ మాదిరిగానే ఎస్సీ కులాలను కూడా A,B,C,D గ్రూపులుగా వర్గీకరించి అన్ని రకాలుగా నష్టపోతున్న మాదిగలకు న్యాయం చేయాలని మంద కృష్ణ మాదిగా కోరారు. ఆయన ఈ ఒక్క ఉద్యమంతోనే సరిపెట్టలేదు. 1972 నుంచి మొదలుకుని మారిన ప్రతీ ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి మాదిగ జాతి నష్టపోతున్న తీరును స్పష్టంగా అర్థమయ్యేలా వివరించి ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరారు. కానీ, ఏ ముఖ్యమంత్రి కూడా ఈ అంశంపై ముందడుగు వేయడానికి ప్రయత్నాలు చేసింది లేదు.

READ MORE: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

2000-2004 వ‌రకు అప్పటి చంద్రబాబు స‌ర్కార్ ఎస్సీ, ఎస్టీ వ‌ర్గీక‌ర‌ణ ను అమ‌లు చేసింది. అయితే మాల‌మ‌హ‌నాడు వ‌ర్గీక‌ర‌ణ‌ను వ్యతిరేకించింది.. హైకోర్టులో న్యాయ‌పోరాటం చేసింది. హైకోర్టు వ‌ర్గీక‌ర‌ణ‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దాంతో 2004 లో అనాటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో ఐదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం విచార‌ణ అనంత‌రం వ‌ర్గీక‌రణను వ్యతిరేఖించింది. వివ‌క్ష, వెనుక బ‌డిన వాళ్లంద‌రిని ఒకే కేట‌గిరిలో ఉంచాల‌ని ఆదేశాలిస్తూ.. హైకోర్టును తీర్పును సుప్రీంకోర్టు స‌మ‌ర్థించింది. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వ‌ర్గీక‌ర‌ణ కోసం పోరాటాలు ప్రజా ఉద్యమాలుగానూ, రాజ‌కీయ ఉద్యమాలుగానూ జ‌రుగుతూనే ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై నేడు సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేత్రుత్వంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వర్గీకరణ తప్పనిసరి అని, ఆ అంశంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అనివార్యమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తిలో తుది తీర్పును వెల్లడించింది. ఏళ్ల నిరీక్షణకు తెరపడింది.

READ MORE:Keerthy Suresh: ఆగస్టు 15 సినిమాల రేస్ లో రఘు తాత..కీర్తి మెప్పిస్తుందా..?

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హర్షం..
ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు ఇచ్చింది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు. 20 ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కిందన్నారు. ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని 2004 నవంబర్‌ 5న చెప్పానన్నారు. అధర్మమే తాతాక్కలిమైనా.. చివరకు ధర్మమే గెలుస్తుందని ఆనాడే చెప్పా అని మందకృష్ణ మాదిగ అన్నారు.