NTV Telugu Site icon

Tiger Chasing Calf: పులి పంజా నుంచి తప్పించుకున్న దూడ.. భయంకర వీడియో వైరల్

Tiger Attack

Tiger Attack

పులి పంజా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరసం లేదు. ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేసుకుందంటే దానిని వెంటాడి వేటాడే వరకు వదలదు. అడవుల్లో ఆహారం లేక పులులు నిత్యం గ్రామాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో పశువులపై దాడి చేయాలని భావించిన పులికి ఎదురు దెబ్బ తగిలింది. పులి దూడను వెంబడిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక పులి ఆవుల గుంపును వెంబడించడం వీడియోలో కనిపిస్తోంది.దూడను లక్ష్యంగా చేసుకుని ఆవులను వెంబడిస్తూనే ఉంటుంది. ఆవు దూడపై పులి పంజా విసిరింది.
Also Read:YS Sharmila: పోలీసులతో వైఎస్‌ షర్మిల దురుసు ప్రవర్తన.. వీడియో ఇదిగో..

అయితే, ఒక ఆవు పులిపైకి దూసుకెళ్లడంతో పులి భయపడి పారిపోయింది. దీంతో దూడ క్షేమంగా బయటపడింది. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద షేర్ చేశారు. ఈ వీడియో లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు ఈ వీడియోపై వివిధ రకాలుగా స్పందించారు. దూడ తృటిలో తప్పించుకోవడం గురించి కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరికొందరు అటవీ భూమిని మానవులు ఎలా ఆక్రమిస్తున్నారని ప్రశ్నించారు. ఇది ఈ జంతువులు మానవ నివాసాలలోకి దారి తీస్తుందని చెప్పారు. కాగా, ప్రపంచంలోని అడవి పులులలో ఇప్పుడు భారతదేశంలో 75% ఉన్నాయి. వాటి సంఖ్య దాదాపు 3200. అయితే, పులల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది.