నాగ చైతన్య పై రివెంజ్.. సమంత మరో సంచలన నిర్ణయం

టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత- నాగ చైతన్య తమ బంధానికి స్వస్తి చెప్పిన విషయం తెలిసిందే.. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని విభేదాల వలన విడిపోయారు. అయితే సామ్.. చై తో విడిపోయిన దగ్గరనుంచి ఆమె చేసే పనులు కొద్దిగా బాధను తెలియజేస్తున్నాయి. పెళ్లి గురించి, జీవితం గురించి ఆమె పెట్టె పోస్టులు ఆమె చై ని ఎంత మిస్ అవుతుందో తెలియజేస్తున్నాయని అభిమానులు నొక్కివక్కాణిస్తున్నారు. ఇకపోతే విడాకుల తరువాత సామ్ గ్లామర్ డోస్ పెంచిందనే చెప్పాలి. పెళ్లి తరువాత ఎప్పడు గ్లామర్ పాత్రల్లో కనిపించని సామ్ విడాకుల తరువాత హాట్ హాట్ ఫోటో షూట్స్, బోల్డ్ సీన్స్ తో కూడిన సినిమాలను ఒప్పుకొంటుంది.

ఇక మరో అడుగు ముందుకు వేసి ఇంకో సంచలన నిర్ణయం తీసుకొంది. ఇప్పటివరకు సామ్ ఐటెం సాంగ్స్ లో నటించలేదు. తాజాగా దానికి కూడా సిద్ధమైపోయింది. ‘పుష్ప’ చిత్రంలో బన్నీ సరసన ఒక స్పెషల్ సాంగ్ లో సామ్ కనిపించనుంది. అయితే ఇదంతా చైతన్యపై కోపంతోనే చేస్తుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. చైతో విడిపోయాకా తాను స్వతంత్రురాలిని అయినట్లు, తానూ ఎలాగైనా జీవించగలను అని నిరూపిస్తునట్లు సామ్ నిర్ణయాలు ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇదంతా చై పై రివెంజ్ తీర్చుకోవడానికేనా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు స్పెషల్ సాంగ్స్ కి ఓకే చెప్పని సామ్ ఇప్పుడు ఒక్కసారిగా ఓకే చెప్పడానికి కారణం అదేనని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇంకొందరు మాత్రం సామ్ కి రంగస్థలం తో మంచి హిట్ ఇచ్చిన సుకుమార్ అడగడంతో ఆమె కాదనలేక ఈ సాంగ్ కి ఒప్పుకున్నది అని అంటున్నారు. మరి వీటిలో ఏది నిజమో తెలియాలంటే సమంత నోరు విప్పాల్సిందే.

Related Articles

Latest Articles