కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డిపై మరోసారి విహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపిని నాశనం చేసి.. కాంగ్రెస్ లోకి వచ్చాడని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఇతర పార్టీ ల నుండి వచ్చిన వాళ్లకు పిసిసి ఇస్తా అంటే ఎలా.. పిసిసి అయ్యాక రేవంత్ జైల్ కి పోతే..పార్టీ జైలు చుట్టూ తిరగాలా? అని ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు తనను తిట్టిన వాళ్ళు లేరు..మూడు,నాలుగు పార్టీలు మారిన వాళ్ళు తిడుతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి అంటే.. ఫోన్ లు చేసి..బూతులు తిడుతున్నారన్నారు. ఇలాంటి ఘటనను జానారెడ్డి ఒక్కడే ఖండించారు.. ఉత్తమ్, భట్టి అసలు స్పందించలేదని ఆరోపించారు. వైఎస్ ను తిట్టినా…మాకు కడప నుండి బెదిరింపులు రాలేదని.. రేవంత్ పెద్ద నాయకుడు అంటారని.. గ్రేటర్ లో ఎన్ని గెలిపించాడని ప్రశ్నించారు. సాగర్ లో జానారెడ్డికి పెద్ద కొడుకు అన్నావు.. హుజూర్ నగర్ లో ఉత్తమ్ సతీమణినీ గెలిపించే బాధ్యత నాది అన్నాడని రేవంత్ పై ఫైర్ అయ్యారు. పిసిసి అయితే… టిడిపి కాంగ్రెస్ చేస్తావా? జూనియర్, సీనియర్ కలిస్తేనే పార్టీ అని చురకలు అంటించారు. . పిసిసి బీసీలకు ఇవ్వండి లేకపోతే.. కోమటిరెడ్డికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పిసిసి అయ్యాక రేవంత్ జైల్ కి పోతే ఎలా.. పార్టీ జైలు చుట్టూ తిరగాలా !
