ద లాస్ట్ థెస్పియన్ … దిలీప్ కుమార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం గర్వించదగ్గ నటుల్లో దిలీప్ కుమార్ స్థానం ప్రత్యేకమైనది. భారతీయ సినిమా స్వర్ణయుగం చవిచూసిన రోజుల్లో ఎందరో మహానటులు తమదైన అభినయంతో అలరించారు. అలాంటి వారిలో దిలీప్ కుమార్ ఒకరు. ఆ తరం మహానటుల్లో మిగిలివున్న ఏకైక నటుడు ఆయనే! అందుకే అందరూ దిలీప్ కుమార్ ను ‘ద లాస్ట్ థెస్సియన్’ అంటూ కీర్తిస్తారు. ఉత్తరాదిన దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవానంద్ త్రిమూర్తులు జైత్రయాత్ర సాగిస్తున్న సమయంలో దక్షిణాదిన తెలుగులో యన్టీఆర్ – ఏయన్నార్, తమిళంలో ఎమ్జీఆర్ – శివాజీగణేశన్, కన్నడ నాట రాజ్ కుమార్, మళయాళ సీమలో ప్రేమ్ నజీర్ రాజ్యమేలారు. ఈ సూపర్ స్టార్స్ లో ఒకే ఒక్క ఎమ్జీఆర్ మాత్రమే దిలీప్ కంటే వయసులో పెద్దవారు. ఇక అందరూ దిలీప్ కంటే వయసులో చిన్నవారే!
దిలీప్ కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసఫ్ ఖాన్. 1922 డిసెంబర్ 11న అవిభాజ్య భారతంలోని పెషావర్ (ఇప్పుడు పాకిస్థాన్ లో ఉంది) జన్మించారు దిలీప్. సినిమా రంగంలో అడుగుపెట్టాకే, యూసఫ్ ఖాన్ కాస్తా దిలీప్ కుమార్ గా మారారు. 1944లో బాంబే టాకీస్ నిర్మించిన ‘జ్వార్ బాటా’తో దిలీప్ కుమార్ చిత్రసీమలో ప్రవేశించారు. ఆ తరువాత నుంచీ తన దరికి చేరిన పాత్రలను పోషిస్తూ సాగిన దిలీప్ కుమార్ “జోగన్, బాబుల్, దీదార్, దాగ్, దేవదాస్, నయాదౌర్, ఆన్, యాహుదీ, కోహినూర్, మొఘల్-ఏ-ఆజమ్, ఆజాద్,గంగ-జమున, రామ్ ఔర్ శ్యామ్, ఆద్మీ, గోపీ” వంటి చిత్రాలలో నటించి జనాన్ని అలరించారు. ముఖ్యంగా ఆయన నటించిన విషాద పాత్రలు దిలీప్ ను ‘ట్రాజెడీ కింగ్’గా నిలిపాయి. దిలీప్ మెథడ్ యాక్టర్ గానూ జేజేలు అందుకున్నారు. రాజ్ కపూర్ తో కలసి ‘అందాజ్’లో నటించిన దిలీప్, దేవానంద్ తో కలసి ‘ఇన్సానియత్’లో అభినయించారు. ఈ ‘ఇన్సానియత్’ తెలుగులో రూపొందిన ‘పల్లెటూరి పిల్ల’కు రీమేక్ కావడం విశేషం.
Also Read
తనకంటే వయసులో 22 సంవత్సరాలు చిన్నదైన నటి సైరాబానును దిలీప్ వివాహమాడారు. 1981 చివరలో ఆస్మాసాహిబా అనే ఆమెను కూడా పెళ్ళాడారు. అయితే ఆ సమయంలో ఎంతోమంది దిలీప్ సన్నిహితులు సైతం సైరాబాను పక్షాన నిలిచారు. దాంతో 1983లో ఆస్మాకు విడాకులు ఇచ్చారు దిలీప్. ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులతో భారత ప్రభుత్వం ఈ మహానటుణ్ణి గౌరవించింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతోనూ దిలీప్ ను సన్మానించారు. 1997లో యన్టీఆర్ నేషనల్ అవార్డునూ దిలీప్ అందుకున్నారు. కళాకారుల విభాగంలో 2000 సంవత్సరంలో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన దిలీప్ ఆరేళ్ళ పాటు ఆ పదవిలో కొనసాగారు.
తాజావార్తలు
-
Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!
-
The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. ‘ది పారడైజ్’ బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
-
Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
-
Mushtaq Khan: ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత.. 200లకు పైగా సినిమాలు.. హాస్య నటుడిగా చెరగని ముద్ర..
-
BJP: రాహుల్ గాంధీకి అవగాహన లేదు..‘‘ఓట్ చోరీ’’పై బీజేపీ స్ట్రాంట్ కౌంటర్..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!