తన కుమారుడు అనిల్ బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ స్పందించారు. అతడి నిర్ణయం తప్పని.. ఈ క్షణం తనను తీవ్రంగా బాధించిందని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. దేశాన్ని విభజించేందుకు, ప్రజాస్వామ్య పునాదులను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్న బీజేపీ, దాని సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) భావజాలానికి తాను ఎప్పటికీ మద్దతు ఇవ్వబోనని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ, ఆరెస్సెల మతతత్వ, విభజన అజెండాకు తానెప్పటికీ వ్యతిరేకమేనని తేల్చి చెప్పారు.
Also Read:Free Insurance: దేశవ్యాప్తంగా 28.78 కోట్ల మందికి.. ఏపీలో 79 లక్షల మందికి ఉచిత బీమా..
తాను కాంగ్రెస్ పార్టీకి, నెహ్రూ-గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్నానని, భారతదేశాన్ని ఏకతాటిపై ఉంచడంతోపాటు భిన్నత్వాన్ని గౌరవించిన ఘనత తమదేనని అన్నారు. తాను రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించిన ఇందిరాగాంధీ నుంచి స్ఫూర్తి పొందానని, విధానపరమైన విషయంలో ఒక్కసారి మాత్రమే ఆమెతో విభేదించానని గుర్తు చేశారు. అయితే ఆ తర్వాత మళ్లీ పార్టీలోకి వచ్చి ఆమెను మరింత గౌరవించానని చెప్పారు. తన రాజకీయ జీవితంలో చివరి దశలో ఉన్నానని.. ఇంకా ఎంతకాలం బతుకుతానో కూడా తెలియదని ఆంటోని చెప్పారు. కానీ జీవించినంత కాలం కాంగ్రెస్ కోసమే బతుకుతానని తెలిపారు. తాను ఇకపై అందుబాటులో ఉండనని అన్నారు. అలాగే, తన కుమారుడు బీజేపీలో చేరికపై మాట్లాడనని.. తన గోప్యతను గౌరవించాలని మీడియాను అభ్యర్థించారు.
Also Read:Covid-19: కరోనాని సీజనల్ వ్యాధిలాగా చికిత్స చేయలేం: IIT శాస్త్రవేత్త
2002 గుజరాత్ అల్లర్లు, ప్రధాని మోడీపై బిబిసి డాక్యుమెంటరీపై వివాదం తర్వాత జనవరిలో అతను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గురువారం కేంద్రమంత్రి పీయూష్ గోయల్, వి.మురళీధరన్, బీజేపీ కేరళ అధ్యక్షుడు కె.సురేంద్రన్ సమక్షంలో అనిల్ ఆంటోని బీజేపీలో చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాల నాయకత్వానికి తాను ఆకర్షితుడయ్యానని, అందుకే బిజెపిలో చేరానని అనిల్ ఆంటోనీ నిర్ణయాన్ని ప్రకటించారు.
