Site icon NTV Telugu

సెంచరీ చేసి తలైవాకు అంకితం ఇచ్చిన టీమిండియా యువ క్రికెటర్

టీమిండియా యువక్రికెటర్ వెంకటేష్ అయ్యర్ దేశవాళీ టోర్నీలో రెచ్చిపోతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో అతడు సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు. చండీగఢ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ తరఫున ఆడుతున్న వెంకటేష్ అయ్యర్.. ఆరో స్థానంలో బ్యాటింగుకు దిగిన కేవలం 113 బంతుల్లోనే 133 స్ట్రైక్‌రేట్‌, 8 బౌండరీలు, 10 సిక్సర్లు బాదేసి 151 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన వెంకటేష్ అయ్యర్ తన సెంచరీని సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు అంకితం ఇచ్చాడు. అంతేకాకుండా తలైవా స్టైలులో కళ్లజోడు పెట్టుకుంటున్నట్లు పోజులిచ్చాడు. ఈ వీడియోను కోల్‌కతా నైట్‌రైడర్స్ ట్విట్టర్‌లో షేర్ చేసింది.

Read Also: పాకిస్థాన్ వెళ్లిన ముగ్గురు విండీస్ క్రికెటర్లకు కరోనా

కాగా డిసెంబర్ 12న రజనీకాంత్ పుట్టినరోజు. తాను కూడా తలైవా అభిమానినే అని క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ పరోక్షంగా చెప్పాడు. అందుకే శతకం పూర్తి చేయగానే అతడు తన చేతిని స్టైల్‌గా తిప్పేస్తూ రజనీకాంత్‌ను అనుకరించాడు. ఇప్పటికే టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన ఛాతీ మీద రజినీకాంత్ టాటూను వేయించుకోగా.. తాజాగా యువ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ తన అభిమాన నటుడికి తనదైన శైలిలో బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పడంతో తలైవా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version