Site icon NTV Telugu

తప్పు తెలుసుకున్నా.. అందుకే విచారం వ్యక్తం చేస్తున్నా : వల్లభనేని వంశీ

నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. ఈ ఘటనపై నందమూరి కుటుంబ సభ్యులు సైతం భువనేశ్వరికి అండగా నిలబడ్డారు. అయితే తాజాగా ఓ ప్రముఖ న్యూస్‌ ఛానెల్‌ నిర్వహించిన డిబేట్‌లో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. సోషల్‌ మీడియాలో నారా లోకేష్‌, ఆయన బృందం నాతో నా కుటుంబంపై చేసిన కామెంట్లకు ఎమోషన్‌లగా ఒక మాట అనబోయి మరో మాట అన్నానన్నారు.

అయితే ఈ విషయంలో తాను కూడా విచారం వ్యక్తం చేస్తున్నాని వెల్లడించారు. అంతేకాకుండా టీడీపీలో అందరి కంటే ఎక్కువగా భువనేశ్వరితో నాకు ఎంతో ఆత్మీయత ఉందని, భువనేశ్వరిని అక్క అని పిలుస్తానంటూ వెల్లడించారు. తన వ్యాఖ్యలతో బాధపడినవారెవరైనా విచారం వ్యక్తం చేస్తున్నానని.. కులం నుంచి వెలివేస్తారని ఈ మాట చెప్పడం లేదని మనస్ఫూర్తిగా చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Exit mobile version