ఇండియా క‌రోనా అప్డేట్‌: స్వ‌ల్పంగా పెరిగిన కేసులు…

ఇండియాలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరిగాయి.  నిన్న రిలీజ్ చేసిన బులిటెన్ ప్ర‌కారం 14 వేల కేసులు న‌మోద‌వ్వగా ఆ కేసులు ఇప్పుడు 15 వేల‌కు పైగా న‌మోద‌య్యాయి.  తాజాగా ఇండియాలో 15,823 కేసులు న‌మోదైన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.  దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,40,01,743కి చేరింది.  ఇందులో 3,33,42,901 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  2,07,653 కేసులు ప్ర‌స్తుతం యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 226 మంది మృతి చెందారు.  దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో 4,51,189 మంది మృతి చెందిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి.  గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 50,63,845 మందికి టీకాలు వేశారు.  దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 96,43,79,212 మందికి టీకాలు అందించారు.  

Read: హుజురాబాద్‌కు అమిత్‌షా…?

-Advertisement-ఇండియా క‌రోనా అప్డేట్‌:  స్వ‌ల్పంగా పెరిగిన కేసులు...

Related Articles

Latest Articles