కరోనా మహమ్మారి ఫస్ట్ వేవ్ గండం గడిచిపోయిందని ఊపిరి పీల్చుకునేలోగా సెకండ్ వేవ్ తో విరుచుకుపడింది. సెకండ్ వేవ్ వచ్చేటప్పటికీ ప్రజల్లో కరోనా పట్ల కాస్త అవగాహన పెరిగినప్పటికీ… మహమ్మారి వేగంగా విస్తరిస్తుండడంతో లక్షల మంది కరోనా పేషంట్లు పిట్టల్లా రాలిపోయారు. ఇక ఇండియాపై సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కూడా గట్టిగానే పడింది. లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ వంటి ప్రభుత్వం చేపట్టిన కరోనా నియంత్రణ చర్యలతో మహమ్మారి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు థర్డ్ వేవ్ ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు వీలైనంత తొందరగా తమతమ దేశాల్లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ను పూర్తి చేయాలని అగ్రదేశాలు అనుకుంటున్నాయి. అందుకే వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేయడానికి తగిన చర్యలను వేగవంతం చేశారు.
Also Read : అమెరికా బయలుదేరిన రజినీకాంత్
అయితే అగ్రదేశం అమెరికాలో కేవలం 150 రోజుల్లోనే 300 మిలియన్ల జనాభాకు వ్యాక్సినేషన్ ను పూర్తి చేయడం విశేషం. అందులో ఇప్పటికే దాదాపు 65% అమెరికన్ అడల్ట్స్ కనీసం మొదటి డోస్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారట. జూలై 14 నాటికి కనీసం 70% జనాభాకు ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని యూఎస్ గవర్నమెంట్ టార్గెట్ గా పెట్టుకుందని సమాచారం. జూలై 14 అమెరికన్లకు స్వాతంత్య్ర దినోత్సవం… అందుకే ఆరోజు నాటికి కనీసం 70% జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోందట.