Site icon NTV Telugu

Upasana-Ram Charan: పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన..మెగా ఇంట సంబరాలు..

Ram Charn Upasana

Ram Charn Upasana

మెగా ఫ్యామిలిలోకి మరో చిన్నారి వచ్చేసింది.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల జంట తల్లి దండ్రులు అయ్యారు.. సోమవారం ఆసుపత్రిలో చేరిన ఉపాసన ఈ రోజు ఉదయం ఆడబడ్డకు జన్మనిచ్చింది. ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ జోడీకి మంగళవారం తెల్లవారు జామున అంటే జూన్ 20న ఆడబిడ్డ పుట్టినట్లు జూబ్లీహిల్స్‌లో ని అపోలో హాస్పిటల్‌ మెడికల్ బులెటిన్ ద్వారా ధృవీకరించింది. ఈ వార్తతో కొణిదెల, కామినేని కుటుంబాలు ఆనందంలో మునిగిపోయాయి. మెగా ప్రిన్సెస్ రాకతో చిరంజీవి, సురేఖ, అనిల్ కామినేని, శోభనా కామినేని గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్‌లు అయ్యారు.. మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవద్దుల్లేవని చెప్పాలి..

మెగా హీరో రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఒక్కో సినిమాతో ఎదుగుతూ గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకుని తండ్రి పేరు నిలబెట్టిన రామ్ చరణ్ తండ్రి కాబోతున్న ఆనందక్షణాలు. వీటికోసమే మెగాభిమానుల ఎదురుచూపులు ఇప్పటివి కావు. అందరి ఆశలు నిజం చేస్తూ రామ్ చరణ్-ఉపాసన దంపతులు ఈరోజు తల్లిదండ్రులు అయ్యారు. జూన్ 20 వేకువఝామున 4గంటలకు కొణిదెల ఇంట మెగా వారసురాలు జన్మించింది.. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో ఈరోజు ఉపాసన పండంటి పాపాయికి జన్మనిచ్చారు.

ఈ వార్తతో మెగా కుటుంబం లో సంతోషం నెలకొంది. ఆసుపత్రిలో రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి, శ్రీమతి సురేఖ దంపతులు ఈ ఉద్విగ్న క్షణాలను ఎంతో ఆనందంతో అనుభవించారు. ఇంతటి అద్భుత క్షణాలు మెగా ఇంట మెరవడంతో కొణిదెల కుటుంబమే కాదు.. ఫ్యాన్స్ కూడా ఆనందంలో మునిగిపోయారు.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగాభిమానులు మెగా వారసురాలి పేరు మీద అనేక దేవాలయాల్లో పూజలు, అర్చనలు చేయించేందుకు సిద్ధమయ్యారు.. ప్రస్తుతం మెగా హీరో రామ్ చరణ్ వరుస సినిమాల తో బిజీగా ఉన్నారు.. శంకర్ దర్శకత్వం లో గేమ్ చేంజర్ సినిమా లో నటిస్తున్నారు.. అలాగే మరో రెండు ప్రాజెక్టు లలో నటిస్తున్నారు..

Exit mobile version