Site icon NTV Telugu

శ్రీశైలం మల్లన్న సేవలో అమిత్‌షా

Amit Shah Srisailam

Amit Shah Srisailam

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు… ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన ఆయన.. ఆ తర్వాత హెలికాప్టర్‌లో శ్రీశైలం చేరుకున్నారు.. అక్కడ షాకు ఘనస్వాగతం లభించింది.. ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ వాని మోహన్, బీజేపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, అంబాల ప్రభాకర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.. ఇక, ఆ తర్వాత శ్రీశైలం ఆలయం వద్ద పూర్ణ కుంభంతో అమిత్ షాకు స్వాగతం పలికారు వేద పండితులు.. అనంతరం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర హోంమంత్రి పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.. నల్లమల ఫారెస్ట్‌ మీదుగా ఆయన ప్రయాణం సాగడంతో.. ఇరు రాష్ట్రాల పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.

Exit mobile version