కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విశ్వరూపం చూపిస్తోంది.. డెల్టా వేరియంట్ కంటే చాలా వేగంగా ప్రంపచదేశాలకు వ్యాపిస్తోంది.. ఇప్పటికే ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 89 దేశాల్లో గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.. మరోవైపు.. ఒమిక్రాన్ నివారణ చర్యలకు పూనుకుంటున్నాయి ఆయా దేశాలు.. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు, ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాయి.. ఇక, ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు వేగంగా పెరుగుతోన్న నేపథ్యంలో యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధం అవుతోంది.. కిస్మస్ తర్వాత రెండు వారాల పాటు లాక్‌డౌన్ విధించే ఆలోచనలో పడిపోయింది.. కరోనా నివారణ కోసం శాస్త్రవేత్తల సలహా బృందం… యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచింది.. అందులో రెండు వారాల లాక్‌డౌన్ కూడా ఉందని చెబుతున్నారు.
Read Also: క్రిస్మస్, సంక్రాంతి హాలీడేస్ ఇవే..
కాగా, యూకేలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి.. గురువారం 88,376 కొత్త కేసులు వెలుగుచూస్తే.. శుక్రవారం ఏకంగా 93,045 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. లండన్‌లో శుక్రవారం ఒకేరోజు 26 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో లండన్ మేయర్ ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ వైపు క్రమంగా ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతుంటే.. ఇంకో వైపు విధులకు హాజరయ్యే సిబ్బంది సంఖ్య తగ్గిపోతోంది. ఇక, ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తుండడంతో.. మరికొన్ని దేశాలు లాక్‌డౌన్, కఠిన చర్యలకు పూనుకుంటున్నాయి.. నెదర్లాండ్‌లో ఆదివారం నుంచి కఠిన లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్టు ప్రకటిస్తే.. ఫ్రాన్స్ న్యూఇయర్ సెలబ్రేషన్స్‌పై నిషేధం విధించింది. డెన్మార్క్ థియేటర్లను, సంగీత కచేరి నిర్వహించే హాళ్లను, మ్యూజియంలు, అమ్యూజ్‌మెంట్ పార్కులను మూసివేసింది.. ఇలా చాలా దేశాలు ఒమిక్రాన్ కట్టడి చర్యలను పూనుకుంటున్నాయి.
