NTV Telugu Site icon

Shocking Murder : యూపీలో పట్టపగలే దారుణం.. యువతిని తుపాకీతో కాల్చి చంపిన దండగులు

Gun

Gun

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నేరాలకు కేరాఫ్ గా మారుతోంది. ఇటీవల కాలంలో హత్యలు జరుగుతున్నాయి. గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ సోదరులు, ఆయన కుమారుడి ఎన్ కౌంటర్ ఘటన మరువక ముందే మరో దారణం జరిగింది. జలాన్ జిల్లాలో ఈరోజు ఉదయం కళాశాల పరీక్షకు హాజరై తిరిగి వస్తున్న యువతిని మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు.
Also Read:CM Jagan Lawyer : కోడి కత్తి కేసులో ఎన్ఐఏ కరెక్టుగా విచారణ జరుపలేదు..

బాధితురాలు రోష్ని అహిర్వార్ అనే 21 ఏళ్ల BA విద్యార్థిని ఉదయం 11 గంటల ప్రాంతంలో పరీక్ష ముగించుకుని రామ్ లఖన్ పటేల్ మహావిద్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తుండగా బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్‌పై ఇద్దరు వ్యక్తులు కంట్రీ మేడ్ పిస్టల్‌తో ఆమె వద్దకు వచ్చారు. వారిలో ఒకరు ఆమె తలపై కాల్చడంతో రోష్ని అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు ఆ వ్యక్తులను పట్టుకునేందుకు పరుగెత్తారు, అయితే వారు ఆయుధాన్ని విసిరి వేగంగా వెళ్లిపోయారు.

యువతి తల్లిదండ్రులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానితును ప్రశ్నిస్తున్నారు. అందరూ చూస్తుండగా రక్తపు మడుగులో నేలపై పడి ఉన్న యువతి యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. యువతి కళాశాల యూనిఫాంలో ఉంది. ఆమె పక్కన నేలపై పిస్టల్ కనిపిస్తుంది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు బీఏ సెకండ్ ఇయర్ విద్యార్థిని, కాలేజీ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్నట్లు జలౌన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ ఇరాజ్ రాజా తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు. ఈ హత్యకు సంబంధించిన చాలా ఆధారాలు లభించాయని, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Also Read:Atiq Ahmed’s Killers: మరో జైలుకు గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హంతకులు
ప్రయాగ్‌రాజ్‌లో గ్యాంగ్‌స్టర్-రాజకీయ అతిక్ అహ్మద్‌ను ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన జరిగిన రెండు రోజులకే తాజాగా మరో యువతిని తుపాకీతో కాల్చ చంపడంతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Show comments