Site icon NTV Telugu

టీమిండియా ఆటగాళ్లు రెండు గ్రూపులుగా విడిపోయారా?

భారత టీ20 కెప్టెన్‌గా ముంబైకి చెందిన రోహిత్ శర్మ ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే టీమిండియాలో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్, మాజీ లెగ్ స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్ ఆరోపించాడు. భారత జట్టుకు ఎక్కువ విజయాలు అందించిన విరాట్ కోహ్లీ టీ20లకు ఉన్నట్టుండి రాజీనామా ప్రకటించడం.. డ్రెస్సింగ్ రూంలో వాతావరణం బాగోలేదని చెప్పడానికి నిదర్శనమన్నాడు. ప్రస్తుతానికి టీమిండియాలో రెండు గ్రూపులు కనిపిస్తున్నాయని.. అందులో ఒకటి ఢిల్లీ గ్రూప్.. రెండోది ముంబై గ్రూప్ అని వ్యాఖ్యలు చేశాడు. పరిస్థితులు చూస్తుంటే కోహ్లీ త్వరలోనే అంతర్జాతీయ టీ20 క్రికెట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతాడని అనిపిస్తోందని తెలిపాడు.

Read Also: న్యూజిలాండ్ సిరీస్ కు భారత జట్టు ఎంపిక

మరోవైపు టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఓటమికి ఐపీఎల్ కారణమని ముస్తాక్ అహ్మద్ ఆరోపణలు చేశాడు. ప్రపంచకప్ లాంటి టోర్నీకి ముందు సుదీర్ఘకాలం బయోబబుల్‌లో ఉండటం టీమిండియా ఆటగాళ్లను మానసికంగా దెబ్బతీసిందని తెలిపాడు. దీంతో ఆటగాళ్లు అలసట చెందారని.. ప్రణాళికల ప్రకారం ఆడలేకపోయారని పేర్కొన్నాడు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఓటమికి ఐపీఎల్ టోర్నీనే కారణమని, ఆటగాళ్లు కూడా మనుషులేనని… సుదీర్ఘకాలం బయోబబుల్‌లో ఉండటం సాధారణ విషయం కాదన్నాడు.

Exit mobile version