దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తుండటంతో కీలక బెంగళూరు నగరపాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మాల్స్, థియేటర్లలో ప్రవేశానికి రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఇదే విధానాన్ని పబ్‌లు, రెస్టారెంట్‌లతో పాటుగా క్యాబ్‌లకు కూడా విస్తరింపజేయాలని బెంగళూరు నగరపాలక సంస్థ చూస్తున్నది. రాబోయే రోజుల్లో కేసులు భారీగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకోనున్నది. ప్రస్తుతం అందరివద్ద స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
Read: కరోనా వేళ ఢిల్లీ ప్రజలకు సీఎం కేజ్రీవాల్ భరోసా…
వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఒకవేళ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో లేని వ్యక్తులు ఎవరైనా ఉంటే వారు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కాపీని చూపితే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా వ్యాక్సిన్ వేయించుకోని వారు ఉంటే వారుకూడా వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉంటుందని అధికారుల భావిస్తున్నారు. అంతేకాదు, బస్సుల్లో కూడా దశల వారీగా ఈ పద్దతిని అమలులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
