భారత ప్రభుత్వం.. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ మధ్య ఇప్పటికే వారు నడుస్తోంది.. తాజాగా, ఆ సంస్థ వ్యవహార శైలి మరోసారి భారత్‌కు కోపం తెప్పించింది.. దీంతో ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది.. కొత్త ఐటీ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని.. లేదంటే చట్టపరమైన పర్యవసానాలను ఎదుర్కోకతప్పదని హెచ్చరించింది ఐటీ మంత్రిత్వ శాఖ ప్యానెల్…ట్విట్టర్ వ్యవహారంపై సీనియర్ అధికారులతో కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.. ఆ తర్వాత నోటీసులు జారీ చేశారు.. కాగా, కొత్త నిబంధనలు గత నెల 26 నుంచి అమల్లోకి వచ్చాయి.. అప్పటికే సోషల్ మీడియా సంస్థలకు మూడు నెలల సమయం ఇచ్చింది కేంద్రం.. ఫేస్‌బుక్ లాంటి సంస్థలు వీటికి ఓకే చెప్పినా.. ట్విట్టర్ మాత్రం వీటికి ఇంకా అంగీకారం తెలపలేదు.. దీంతో.. కేంద్రం, ట్విట్టర్ మధ్య వివాదం నడుస్తూనే ఉండగా.. తాజా పరిణామలు నిప్పురాజేసినట్టు అయ్యింది.