Site icon NTV Telugu

బ్రేకింగ్ : టీటీడీలో ఉదయాస్తమాన సేవ.. ధర రూ.కోటి

అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడి సేవలో తరించేందుకు మరోసారి టీటీడీ అవకాశం కల్పించింది. ఏడుకొండల వేంకటేశ్వర స్వామి వారి ఉదయాస్తమాన సేవల టికెట్‌ ధర నిర్ణయిస్తూ టీటీడీ ప్రకటన చేసింది. సాధారణ రోజుల్లో టికెట్‌ ధర రూ.కోటి ఉండగా.. శుక్రవారం నాడు మాత్రం రూ.కోటిన్నరగా నిర్ణయించింది. ఈ టికెట్‌పై 6గురు స్వామి వారి సేవలో పాల్గొనవచ్చు. జనవరి రెండో వారం నుంచి 531 ఉదయాస్తమాన సేవా టికెట్లను అందుబాటులో ఉంచనుంది. అయితే ఈ టికెట్ల ద్వార రూ.600 కోట్ల ఆదాయం సమాకూరనుండగా.. ఈ ఆదాయం మొత్తంతో చిన్నారుల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించనుంది. ఈ క్రమంలో టీటీడీ ఈనెల 23న ఉదయాస్తమాన సేవా ట్రయల్‌ రన్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఉదయాస్తమాన టికెట్‌తో స్వామివారికి ఉదయం నిర్వహించే సుప్రభాత సేవ నుంచి తోమాల సేవ, కొలువు, అష్ట దళ పాద పద్మారాధన, అభిషేకం, వస్త్రాలంకార సేవ, కల్యాణోత్సవం, రథోత్సవం, తిరుప్పావడ, సహాస్ర దీపాలకరణ సేవతో పాటు ఏకాంత సేవలో పాల్గొనవచ్చు.

Exit mobile version