Site icon NTV Telugu

తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం టీటీడీ కీలకమైన ప్రకటన చేసింది. తిరుమలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తీసుకురావాలని స్పష్టం చేసింది. ఒకవేళ వ్యాక్సిన్ ఇంకా వేయించుకోని నేపథ్యంలో 48 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలని తెలిపింది. ఈ విషయాన్ని గతంలోనే తాము ప్రకటించినా కొంత మంది భక్తులు పట్టించుకోకుండా తిరుమల కొండపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని టీటీడీ అసహనం వ్యక్తం చేసింది.

Read Also: సంక్రాంతి సందర్భంగా స్పెషల్ రైళ్లు

దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భక్తులు ఈ సూచనను పాటించకపోతే అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద అధికారులు ఆపివేస్తారని టీటీడీ తెలిపింది. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా ఆర్టీపీసీఆర్ టెస్ట్ సర్టిఫికెట్ లేనివారిని నిర్ధాక్షిణ్యంగా వెనక్కి పంపుతారని.. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని హితవు పలికింది. భక్తుల భద్రత దృష్ట్యా ఈ నియమం అమలు చేయడం జరుగుతోందని… టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి దయచేసి భక్తులు సహకరించాలని కోరింది.

Exit mobile version