NTV Telugu Site icon

శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఈ తేదీల్లో సిఫార్సు లేఖల రద్దు..

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. ముఖ్యంగా సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు అలెర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. ఎందుకంటే.. సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది.. జనవరి 1వ తేదీన సిఫార్సు లేఖల స్వీకరణ ఉండదని స్పష్టం చేసింది టీటీడీ.. అదే విధంగా జనవరి 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కూడా సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటించింది.. మరోవైపు.. జనవరి 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్‌ను కూడా రద్దు చేస్తున్నట్టు టీడీపీ వెల్లడించింది.. మరోవైపు.. కరోనా పరిస్థితుల దృష్ట్యా.. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి శ్రీవారి దర్శనం కల్పించాలని టీడీపీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే కాగా… మరోసారి వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌పై క్లారిటీ ఇచ్చింది టీటీలడీ.. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులుకు కోవిడ్ వ్యాక్సినేషన్ లేదా కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి అని స్పష్టం చేసింది.