Site icon NTV Telugu

ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు

ఏపీలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్‌ సమీర్‌ శర్మ ఉత్వర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇరిగేషన్ స్పెషల్ సీఎస్‌గా కేఎస్ జవహర్ రెడ్డి, టీటీడీ ఈఓగా జవహర్ రెడ్డికి అదనపు భాద్యతలు అప్పగించారు. వీరితో పాటు ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా శ్యామల రావు, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ స్పెషల్ సీఎస్‌గా జి. సాయి ప్రసాద్, ఆర్థికశాఖ కార్యదర్శి(కమర్షియల్ టాక్స్)గా ముఖేష్ కుమార్ మీనా ను బదిలీ చేశారు.

అంతేకాకుండా పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌గా ఎస్.సురేష్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గా వి.చిన వీరభద్రుడు, సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీగా పి. రంజిత్ బాషా, చేనేత డైరెక్టరుగా సి.నాగ రాణి, బీసీ సంక్షేమశాఖ డైరెక్టరుగా పి.అర్జున్ రావును బదిలీ చేస్తూ సీఎస్‌ మంగళవారం రాత్రి ఆదేశాలు ఇచ్చారు. రాత్రికి రాత్రే ఐఏఎస్‌లను బదిలీ చేయడంపై ఏపీలో ఒక్కింత ఆశ్చర్యం నెలకొంది.

Exit mobile version