ట్రాఫిక్ ఉల్లంఘనులు.. నెంబర్ ప్లేట్లకి మాస్కులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోంది. చాలామంది హెల్మెట్లు వున్నా పెట్టుకోకుండా ప్రయాణాలు చేస్తుంటారు. తాజాగా కోవిడ్ మహమ్మారి వేళ హెల్మెట్ పెట్టుకోకుండా, ట్రాఫిక్ పోలీసులకు దొరకకుండా నానా ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.
సోషల్ మీడియా వేదికగా ట్రాఫిక్ పోలీసులు అలాంటి ఘనుల ఫోటోలను షేర్ చేస్తున్నారు. హెల్మెట్ లేకపోవడమే కాకుండా మాస్కులు లేకుండా యథేచ్ఛగా నగర రోడ్లపై తిరిగేస్తున్నారు. వైద్య శాఖ అధికారులు ఒకవైపు ఒమిక్రాన్ వేరియంట్ గురించి హెచ్చరిస్తూనే వున్నారు. అయినా వారిలో మార్పులు కనిపించడంలేదు. కరోనా మహమ్మారి వేళ తమ ముఖాలకు పెట్టుకోవాల్సిన మాస్కులు బైక్‌లు, స్కూటర్ల నెంబర్ ప్లేట్లపై అతికించి చట్టానికి దొరకకుండా తప్పించుకుంటున్నారు.
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
These new variant patients will be treated with proper IPC sections.#CaptionPlease pic.twitter.com/buKGT6GdcK
— Hyderabad City Police (@hydcitypolice) December 7, 2021
ఇక్కడ నెంబర్ ప్లేట్లపై ఎలాంటి మాస్కులు అంటించారో చూడండి. ఇలాంటి వారిపై ఏవిధమయిన చర్యలు తీసుకోవాలో చెప్పాలంటూ నెటిజన్లను ప్రశ్నించారు ట్రాఫిక్ పోలీసులు. ఇలాంటి వారిని శిక్షించడానికి సరైన ఐపీసీ సెక్షన్లు వాడాలని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. వీరిని న్యూ వేరియంట్ పేషెంట్లని పోలీసులు చమత్కరిస్తున్నారు.
వీళ్ళు చాలా స్మార్ట్ అంటున్న పోలీసులు
ఇలాంటి వారిపై భారీగా జరిమానాలు విధించాలని నెటిజన్లు కోరుతున్నారు. సీసీ టీవీ కెమేరాల ద్వారా వారి భరతం పట్టాలంటున్నారు. ”మీ ముఖానికి మాస్కు వుంటే క్వారంటైన్ నుంచి తప్పించుకోవచ్చు. కానీ మీ వెహికల్ నెంబర్ ప్లేట్ మీద మాత్రం మాస్కులేసి మాయ చేస్తే మాత్రం మీ వెహికల్ క్వారంటైన్ (జైలు)కి వెళ్ళడం గ్యారంటీ అంటున్నారు పోలీసులు. ఇలాంటి వారిపట్ల ప్రత్యేక చర్యలు చేపడతామంటున్నారు.
ప్రత్యేక పెట్రోలింగ్ వాహనాలు ఏర్పాటుచేసి ఇలాంటివారిని పట్టుకోవాలంటున్నారు. కొంతమంది బ్లాక్ టేప్‌లు అంటించి రిజిస్ట్రేషన్ నెంబర్లు కనిపించకుండా చేస్తున్నారు. ఇలాంటివారు ట్రాఫిక్ సిగ్నళ్ళ దగ్గర కనిపించిన వెంటనే జరిమానాలు వేయడం, వెహికల్ సీజ్ చేయడం చేస్తామంటున్నారు. పోలీసుల దగ్గర అందుబాటులోకి వచ్చిన సీసీ కెమేరాలు, బాడీ వోర్న్ కెమేరాల ద్వారా వీరి భరతం పట్టాలని నిర్ణయించారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!