టాలీవుడ్ కింగ్ నాగార్జున “ఘోస్ట్”గా మారాడు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా నాగార్జున తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ మేకర్స్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సినిమాకి “ఘోస్ట్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ లో నాగ్ కత్తి పట్టుకుని శత్రువులను వేటాడే పనిలో ఉన్నాడు. కొంతమంది విలన్లు ఆయన ముందు మోకరిల్లి కన్పిస్తున్నారు. ఈ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న విదేశీ బ్యాడ్డీలు, లండన్ ల్యాండ్‌స్కేప్ పిక్ చూస్తుంటే సినిమా అంతర్జాతీయ కథాంశంతో రూపొందబోతున్నట్లు అన్పిస్తోంది.
Read Also : విశాల్ “సామాన్యుడు” కాడు… ఫస్ట్ లుక్ పోస్టర్
ప్రీ లుక్ తో ఆసక్తిని రేకెత్తించిన నాగ్ ఫస్ట్ లుక్ తో ఆయన అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చారు. “ఘోస్ట్”లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.