NTV Telugu Site icon

వాన కష్టాలు: ఇంట్లోకి వరద చేరకుండా అడ్డుగోడ!

తిరుపతి వర్షంతో వణికిపోతోంది. వరుణ దేవుడు తన ప్రతాపం చూపడంతో ఆధ్యాత్మిక క్షేత్రం అల్లాడిపోతోంది. ఎటు చూసినా వరదలే. జనం అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారు. తిరుపతిలోని మ్యూజియం పక్కనే వున్న ఏపీ టూరిజం హోటల్ వెనుక వైపున విరిగి పడ్డాయి కొండచరియలు. గోడకూలి ఇరుక్కుపోయారు వంట మాస్టర్, మరో మహిళ. ఇరువురిని కాపాడి ఆస్పత్రికి తరలించారు ఫైర్ సిబ్బంది. పీలేరు సమీపంలో అగ్రహారం చెరువు పూర్తిగా నిండడంతో చెరువు తెగే ప్రమాదం ఏర్పడింది.

దిగువ భాగాన వున్న గ్రామస్తులను హుటా హుటిన సురక్షిత ప్రాంతాలకు తరలించారు పోలీసులు. జపాలి ఆంజనేయస్వామి ఆలయం మునిగిపోయింది. ఇంట్లోకి వర్షం నీళ్లు రాకుండా గోడ కడుతున్నారు తిరుపతిలోని ఓ కాలనీవాసి.