తిరుపతిలో కుప్పకూలిన భవనం.. తప్పిన పెను ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు రాయలచెరువు లీకేజీలతో తిరుపతి జనం కంటిమీద కునుకులేకుండా పోతోంది. తాజాగా ఓ పాత భవనం కుప్పకూలింది. తిరుపతి భవానీ నగర్ లో కుప్పకూలింది మూడంతస్థుల భవనం. వర్షాలకు పది రోజులుగా పాత భవనం నానిపోయింది. శిథిలావస్ధకు చేరడంతో రెండేళ్ళ క్రితమే ఇంటిని ఖాళీచేశాడు యాజమాని. ఇంటిలో, సమీప ప్రాంతాలలో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది. ఇదిలా వుంటే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి వర్షాలు.
రాత్రి తిరుపతి, శ్రీకాళహస్తి,సత్యవేడు, నగరిలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాయల చెరువు కట్టకు ఎటువంటి ప్రమాదమూ లేదని, పూర్తిస్థాయిలో చెరువు నిండటం వల్ల కట్టలోని కొన్ని ప్రాంతాల్లో నీరు ఊరి బయటకు వస్తోందని, ఒక ప్రాంతంలో ఇప్పటికే ఇసుక బస్తాలతో మూసేశామని, అలాగే రెండో ప్రాంతంలోనూ చేస్తున్నామని కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు.
Also Read
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
- South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
చెరువు కు సంబంధించి నీటి ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో లు నిపుణుల సూచనల మేరకే పంపడం జరుగుతోందని పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించి నిపుణులు, ఇంజనీరింగ్ అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ చెబుతున్నారు. రామచంద్రాపురం, తిరుపతి రూరల్ మండలాల ప్రజలకు ఏడు రోజులపాటు కంటిమీద కునుకులేకుండా చేసిన రాయలచెరువు కట్టకు పడ్డ మూడు గండ్లను శనివారం సాయంత్రానికి అధికారులు పూడ్చివేశారు. దీంతో ప్రజలు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఒకవైపు రాయల చెరువు తెగిపోతోందన్న వార్తలతో జనం ఆందోళనకు గురయ్యారు. అయితే ఎలాంటి ప్రమాదం లేదని, రాయలమ్మకు పూజలు చేసిన అనంతరం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భరోసా ఇచ్చారు.

తాజావార్తలు
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
-
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
-
Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
-
Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!