భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య ఈరోజు రెండో టెస్ట్ ముంబై వేదికగా ప్రారంభం కావాల్సి ఉంది. కానీ గత రెండు రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురిసాయి. దాంతో ప్రస్తుతం అక్కడి పిచ్ తడిగా ఉండటంతో టాస్ ను కొంత సమయం వాయిదా వేశారు అంపైర్లు. అయితే ఈ మ్యాచ్ లో పోటీ పడే భారత జట్టును ఇంకా ప్రకటించాక పోయినప్పటికీ బీసీసీఐ ఓ ప్రకటన చేసింది. భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానే, ఆల్ రౌండర్ జడేజా, బౌలర్ ఇషాంత్ శర్మ గాయం కారణంగా ఈ రెండో టెస్ట్ నుండి తప్పుకున్నారు అని ప్రకటించింది. కానీ వీరి స్థానంలో ఇప్పుడు జట్టులోకి ఎవరు వస్తారు అనేది మాత్రం చెప్పలేదు. అయితే ముంబైలో కురిసిన వర్షాల కారణంగానే రెండు జట్లు ఇండోర్ ప్రాక్టీస్ చేసిన విషయం తెలిసిందే. అలాగే కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ తో తిరిగి జట్టులోకి రావడంతో టీం ఇండియా మరింత బలంగా తయారైంది. అయితే మొదటి టెస్ట్ లో కోహ్లీ లేకుండానే తలపడిన భారత జట్టు మ్యాచ్ ను డ్రా గా ముగిసింది.
రెండో టెస్ట్ నుండి ఆ ముగ్గురు దూరం.. ప్రకటించిన బీసీసీఐ
