NTV Telugu Site icon

School Shooting: స్కూల్లో ఆకస్మికంగా కాల్పులు.. విద్యార్థులు సహా ఆరుగురు మృతి

School Shooting

School Shooting

అమెరికాల్లో మరోసారి కాల్పుల కలకలం రేపింది. టెన్నెస్సీలోని నాష్‌విల్లేలోని ఒక ప్రాథమిక పాఠశాలలో ఒక మహిళ కాల్పులు జరపడంతో ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రీ-స్కూల్ నుండి ఆరవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల కోసం ప్రైవేట్ క్రిస్టియన్ పాఠశాల అయిన నాష్‌విల్లేలోని పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల వయసున్న ముగ్గురు పిల్లలకు తుపాకీ గాయాలు ఉన్నాయని అధికారులు తెలిపారు వాండర్‌బిల్ట్‌లోని మన్రో కారెల్ జూనియర్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు చేరుకున్న తర్వాత వారు చనిపోయినట్లు ప్రకటించారు. మిగత బాధితులందరూ 60 ఏళ్లు పైబడిన వారేనని అధికారులు తెలిపారు.

Alsor Read:Bhatti Vikramarka: రాష్ట్రాన్ని కేసీఆర్ 70 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు.. బీఆర్ఎస్ పాలనంతా స్కాములమయం

నిందితురాలు 28 ఏళ్ల యువతి ఆడ్రీ హేల్‌గా మెట్రోపాలిటన్ నాష్‌విల్లే పోలీస్ డిపార్ట్‌మెంట్ గుర్తించింది. ఘటన జరిగిన అనంతరం ఆమెని పోలీసులు కాల్చివేశారు. నిందితురాలు నాష్‌విల్లే నివాసిగా గుర్తించారు.హేల్ వద్ద అసాల్ట్ రైఫిల్, తుపాకీ, అలాగే పిస్టల్ ఉన్నాయని పోలీసులు తెలిపారు. హేల్ పాఠశాలలో మాజీ విద్యార్థిగా భావిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ దాడి పాఠశాలలోని లాబీ తరహా ప్రాంతం వద్ద జరిగిందని, తరగతి గదిలో కాదని పోలీసు అధికారి తెలిపారు. స్కూల్‌లో జరిగిన కాల్పులపై అధ్యక్షుడు జో బిడెన్‌కు సమాచారం అందించామని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ తెలిపారు.అయితే, నిందితురాలు ఎందుకు కాల్పులు జరిపింది అనే దానిపై సమాచారం లేదు.
Alsor Read:Rashmika Mandanna: నేషనల్ క్రష్.. బ్లాక్ డ్రెస్ లో అదరగొట్టింది

కాగా, యూఎస్‌లో స్కూల్‌లో కాల్పుల ఘటనలు సర్వసాధారణంగా మారాయి. కొద్ది రోజుల క్రితం డెన్వర్ పాఠశాలలోని అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందిలో ఇద్దరు సభ్యులను కాల్చి గాయపరిచిన తర్వాత 17 ఏళ్ల యువకుడు ఘోరంగా కాల్చి చంపబడ్డాడు. శాండీ హుక్ ప్రామిస్, కనెక్టికట్‌లోని శాండీ హుక్ పాఠశాలలో 2012లో జరిగిన మారణకాండ జరిగింది.